జనసేనాని ఢిల్లీ టూర్... ఏపీలో రాజకీయాలలో ఆసక్తికర పరిణామం  

Janasena Chief Pawan Kalyan Delhi Tour - Telugu Ap Politics, Bjp, Delhi Tour, Janasena Chief Pawan Kalyan, Ysrcp

ఏపీ రాజకీయాలలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన మరోసారి వేడిని పెంచింది.రాయలసీమలో గత మూడు రోజులుగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ అధికార పార్టీ వైసీపీ మీద విమర్శన బాణాలు సంధిస్తూ వారిని టెన్షన్ పెట్టిస్తున్నాడు.

Janasena Chief Pawan Kalyan Delhi Tour

జగన్ ఇలాకాలోకి వెళ్లి అక్కడే రాయలసీమలో బలంగా ఉన్న వైసీపీ పార్టీ మీద, జగన్ మీద తన మాటల దాడిని కొనసాగిస్తున్నాడు.మరో వైపు ఈ పర్యటనలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసి ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలకి పవన్ కళ్యాణ్ తెరతీసారు.

తాను బీజేపీతో ఎప్పుడు విదిపోలేదని చెప్పడం ద్వారా ఆ పార్టీకి దగ్గరగా ఉన్నాననే విషయాన్ని చెప్పుకొచ్చారు.అలాగే పవన్ పర్యటనలో భాగంగా చేసిన కొన్ని వ్యాఖ్యలని వైసీపీ నేతలు హైలెట్ చేసి అతని వ్యక్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే రాయలసీమ పర్యటనలో ఉండగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఉన్నపళంగా వెళ్ళడానికి రెడీ అయ్యారు.షెడ్యూల్ ప్రకారం శుక్రవారం కూడా చిత్తూరు జిల్లాలో పర్యటించాల్సి ఉన్నా దాన్ని కుదించుకుని హస్తిన వైపు ప్రయాణం అయ్యారు.

తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.నెల రోజుల క్రితం ఒకసారి ఢిల్లీ వెళ్లి అక్కడ నాలుగు రోజులు ఉన్న పవన్ కళ్యాణ్ కొంత మంది బీజేపీ నేతలతో రహస్యంగా బేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపధ్యంలో ఢిల్లీ టూర్ తర్వాత తలపెట్టిన బీజేపీపై తన విధానం మార్చుకున్నట్లు కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఇక మరోసారి అమిత్‌షాను కలిసేందుకే ఢిల్లీ వెళ్తున్నట్టు వార్తలు రావడంతో ఇప్పుడు ఈ అంశం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

#AP Politics #Ysrcp #Delhi Tour #Bjp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Janasena Chief Pawan Kalyan Delhi Tour Related Telugu News,Photos/Pics,Images..