' మెగా ' క్రేజ్ కోసం జనసేన ఆరాటం ? అదే జరిగితే ?

ఎన్నో ఆశలతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా తగులుతున్న ఎదురుదెబ్బలు కొత్తేమీ కాదు.2014 ఎన్నికల్లో తమ బలం సరిపోదనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉండి టిడిపి, బిజెపి కూటమిని గెలిపించడానికి తన వంతు కృషి పవన్ చేశారు.అయితే 2019 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లినా ఘోరమైన ఓటమి పవన్ ను పలకరించింది.కేవలం ఒకే ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం కాగా, తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

 Janasena Party Want To Support Megastar Chiranjeevi In Future Janasena, Pawan Ka-TeluguStop.com

అయితే ముందుగా పవన్ ఎన్నికల ప్రచారానికి తన అన్న మెగాస్టార్ చిరంజీవి వస్తారని భావించినా, చిరు మాత్రం గత ప్రజారాజ్యం అనుభవాలతో మళ్ళి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యేందుకు ఇష్టపడలేదు.దీంతో జనసేన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.

పవన్ మరో సోదరుడు నాగబాబు మాత్రమే ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా, నరసాపురం పార్లమెంట్ బరిలో కూడా దిగారు.అయన్నూ ఓటమి పలకరించింది.

Telugu Janasena, Janasena Bjp, Nagendrababu, Pawan Kalyan-Political

ఒకవైపు ఏపీలో అధికార పార్టీ వైసీపీ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో 2024 జనసేన బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో ఉన్నారు.కానీ తన ఒక్కడి వల్ల అది సాధ్యం కాదు అనే విషయం పవన్ కు ముందే అర్థమైంది.అందుకే ఆర్థికంగా, ఐడియాలజీ పరంగా తమకు అన్ని విధాల దండలు అందిస్తుందనే ఉద్దేశంతో పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

కానీ బీజేపీ వ్యవహారశైలి పవన్ కు అంతగా నచ్చడం లేదు.దీంతో రాజకీయంగా తిరుగులేని విధంగా జనసేన ను తీర్చిదిద్దాలంటే మెగాస్టార్ చిరంజీవి మద్దతు జనసేనకు ఉండేలా చూడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

జనసేనకు చిరంజీవి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోయినా, పరోక్షంగా అయినా మద్దతుగా నిలబడినట్లుగా జనాల్లోకి సంకేతాలు పంపితే, జనసేనకు మంచి ఊపు వస్తుందని, చిరు అభిమానులంతా జనసేనకు అండగా నిలబడతారనే అభిప్రాయంలో పవన్ ఉన్నారు.

Telugu Janasena, Janasena Bjp, Nagendrababu, Pawan Kalyan-Political

ఇక ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో చిరు కూడా పవన్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.చిరంజీవి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నా, ఆయన మాత్రం ఆ విషయంలో ఆసక్తిగా లేరు.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి చిరంజీవి మాట్లాడుతూ, తాను వేరే పార్టీ లో చేరేది లేదని, ఇంట్లో వ్యక్తి రాజకీయ పార్టీ ఉండగా తామంతా మద్దతు ఇవ్వడం సరైంది అంటూ చిరు తేల్చేశారు.

ఇక నాగేంద్రబాబు కూడా ఇదే విషయమై మాట్లాడుతూ జనసేనలోకి వచ్చే విషయంలో మెగాస్టార్ ఓ ప్రశ్నకు మీడియాకు సమాధానం ఇస్తూ, ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో లేనని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ వ్యాఖ్యానించారు.ఇక మెగాస్టార్ విషయం లో జనసేన కూడా పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మెల్లిమెల్లిగా చిరుని జనసేన కు అనుకూలంగా ఉండేలా ఒప్పించి ట్వీట్లు, మీడియా ఇంటర్వ్యూ లు ఇప్పించి మైలేజ్ పొందాలని జనసేన భావిస్తూ ఆ విధంగా అడుగులు వేస్తోంది.అదే జరిగితే జనసేనకు ఏపీలో రాజకీయంగా పై మెట్టు ఎక్కే అవకాశం తప్పకుండా లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube