పరిషత్ ఎన్నికల విషయంలో జనసేన పార్టీ సంచలన నిర్ణయం..!!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి రోజే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయటం తెలిసిందే.ఈనెల 8వ తారీఖున పోలింగ్, 9వ తారీఖున రీపోలింగ్, పదవ తారీకు నాడు ఫలితాలు రిలీజ్ చేయాలని నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ డిసైడ్ అవ్వడం జరిగింది.

 Janasena Party's Sensational Decision Regarding Parishad Elections Janasena, Paw-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈ రోజు అన్ని పార్టీల సమావేశాలకు ఎన్నికల కమిషన్ పిలుపునివ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరు కాకూడదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

పరిషత్తు ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా అధినేత పవన్ మండిపడ్డారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిందని దానిపై ఇంకా తీర్పు రాకముందే, ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే ఆల్ పార్టీ మీటింగులకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు.కొత్త ఎస్ఈసి నీలం సాహ్ని అధికార పార్టీ వైసీపీకి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube