టీడీపీతో కూడా కలుస్తామన్న జనసేన నేత  

Janasena Party Working With Tdp Party Use For Ap Peoples - Telugu Ap, Ap Tdp, Janasena And Bjp, Janasena Party, Janasena Party Chief Pawan Kalyan, , Nadendla Manohar

ఏపీ ప్రయోజనాల కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్దం అయినట్లుగా జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు.బీజేపీతో కలిసి నడవడం వల్ల పలు ప్రయోజనాలు రాష్ట్రంకు వస్తాయనే ఉద్దేశ్యంను ఆయన వ్యక్తం చేశారు.

Janasena Party Working With Tdp Party Use For Ap Peoples

ఇక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా జనసేన పోరాటం చేయబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.ఈ పోరాటంను తెలుగు దేశం పార్టీతో కలిసి చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

2014 ఎన్నికల్లో బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీలకు జనసేన మద్దతు ఇచ్చిన విషయం తెల్సిందే.మొన్నటి ఎన్నికల్లో జనసేన సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేసింది.

మూడు పార్టీలు మూడు ముక్కలు అయ్యి పోటీ చేయగా ఏ పార్టీకి స్పష్టమైన సీట్లు రాలేదు.దాంతో వైకాపాకు లాభం చేకూరింది.

వైకాపా అధికారంలోకి వచ్చింది.మళ్లీ జనసేన ఈ మూడు పార్టీల కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ జరుగుతోంది.

జగన్‌ కంటే బాబు బెటర్‌ అనే ఉద్దేశ్యానికి ఇప్పటికే ప్రజలు వచ్చారని అందుకే బాబుకు మద్దతుగా ఉంటే ఆయన అధికారంలోకి వస్తాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Janasena Party Working With Tdp Party Use For Ap Peoples Related Telugu News,Photos/Pics,Images..

footer-test