తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి జనసేన దూరం

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎమర్జింగ్ అవుతున్న జనసేన పార్టీ భవిష్యత్తు రాజకీయాలకి కేంద్ర బిందువుగా ఉంది.ఇక ఏపీ రాజకీయాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క స్థానంకి పరిమితం అయిన కూడా ఎన్నికల తర్వాత ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ తనదైన శీలిలో దూసుకెళ్తున్నారు.

 Janasena Party Will Not Participated In Telangana Municipal Elections-TeluguStop.com

ఇక తెలంగాణ రాజకీయాలలో కూడా జనసేన పార్టీకి క్యాడర్ ఉంది.ఆ పార్టీ తరుపున పోటీ చేయాలని చాలా మంది ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణకి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తుంది.గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో కనీసం జనసేన పార్టీ తరుపున ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ చేయలేదు.

ఇక ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఈ నెలలో జరగనున్నాయి.

ఇక ఈ ఎన్నికలలో జనసేన తరుపున పోటీ చేయాలని చాలా మంది భావించారు.

అయితే వాళ్ళకి పవన్ కళ్యాణ్ మరోసారి షాక్ ఇచ్చారు.తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో జనసేన గాజు గుర్తు మీద పోటీ చేయడం లేదని, ఎవరైనా ఆసక్తి ఉన్న అభ్యర్ధులు పోటీలో దిగాలనుకుంటే ఇండిపెండెంట్ గా నిలబడాలని, వారికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

ఈ ప్రకటన అధికారికంగా రావడంతో మరోసారి జనసేన అభిమానులకి తెలంగాణలో పవన్ కళ్యాణ్ మొండిచేయి చూపించినట్లు అయ్యింది.పవన్ కళ్యాణ్ అప్పుడే చేతులెత్తేసాడని, ఇక తెలంగాణలో ఆ పార్టీని నమ్ముకుంటే అంతే సంగతులు అని పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు, వైసీపీ అభిమానులు విమర్శలతో ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube