జనసేనా పార్టీ నుంచి రాపాక సస్పెండ్!

ఏపీ రాజకీయాలలో సుదీర్ఘంగా గత కొంత కాలంగా తీవ్ర ఉత్కంట పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.అధికార పార్టీ వైసీపీ వరుసగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అంటూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఏకపక్షంగా తన బలంతో ముందుకి వెళ్తుంది.

 Janasena Party Suspended On Mla Rapaka From Party-TeluguStop.com

వీటిని విపక్షాలు అన్ని కూడా తీవ్రంగా తప్పు పట్టిన కూడా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.ఇదిలా ఉంటే అసెంబ్లీలో జనసేన పార్టీ తరుపున ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ అధిష్టానం మీద ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

పార్టీ నిర్ణయాలకి విరుద్ధంగా సొంతం అజెండాతో వెళ్తున్నాడు.అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రాపాకని చూసి చూడనట్లు వ్యవహరించారు.

అతనే తన పద్ధతి మార్చుకుంటాడు అని చెప్పుకుంటూ వస్తున్నారు.మరో వైపు గత కొద్ది రోజులుగా వివిధ యూట్యూబ్ చానల్స్ లో కూడా జనసేన పార్టీ విధానాల మీద, పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

తాను పవన్ కళ్యాణ్ చరిష్మాతో గెలవలేదని, సొంత క్యాడర్ ఉండటం వలన మాత్రమే గెలిచినట్లు చెప్పుకుంటున్నాడు.

ఇక రాపాకని అడ్డుపెట్టుకొని వైసీపీ కూడా జనసేన పార్టీ మీద ఎదురుదాడి చేస్తూ వస్తుంది.

తాజాగా కాకినాడలో జనసేన కార్యకర్తల మీద వైసీపీ వాళ్ళు దాడి చేసిన కూడా రాపాక వరప్రసాద్ అసలు స్పందించలేదు.ఈ విషయంలో ఇప్పటికే జనసేన కార్యకర్తలు అందరూ రాపాకని వ్యతిరేకిస్తున్నారు.

అయితే బహిరంగంగా అతని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయకపోయినా పార్టీ అధిష్టానం కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.ఈ నేపధ్యంలో మూడు రాజధానులకి వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాపాక మీద చర్యలు ఉంటాయని చెప్పారు.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీ నుంచి రాపాకని సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.

దీని మీద అధికారిక ప్రకటన కూడా వెల్లడించారని టాక్ వినిపిస్తుంది.మరి ఈ సస్పెన్షన్ మీద రాపాక ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube