ఆ మంత్రిని టార్గెట్ చేసిన జ‌న‌సేన‌.. వార్ షురూ!

ఏపీ రాజ‌కీయాలు మ‌ళ్లీ వేడుక్కుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.త‌న‌కు క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కాస్త సైలెంట్‌గా ఉంటున్న ప‌వ‌న్ ఇప్పుడు మ‌ళ్లీ స్పీడ్ పెంచిన‌ట్టు క‌నిపిస్తోంది.

 Janasena Party Started Targetting Ycp Minister Vellampalli Srinivas Illegal Works-TeluguStop.com

ఇందులో భాగంగా త‌న పార్టీ లీడ‌ర్ల‌ల‌తో సీఎం జగన్ కేబినెట్ లోని కీలక మంత్రులను టార్గెట్ చేసి సంచ‌ల‌న ఆరోపణలు చేయించేందుకు రెడీ అయ్యారు.మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుత దేవాదాయ శాఖ మినిస్ట‌ర్ వెల్లంపల్లి శ్రీనివాస్ పెద్ద ఎత్తున కుంభ‌కోణాల‌కు పాల్పడుతున్న‌ట్టు జ‌న‌సేన ఆరోప‌ణ‌లు చేయ‌డం స్టార్ట్ చేసింది.

జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయిన పోతిన మ‌హేశ్ రీసెంట్ మంత్రిపై చేసిన ఆరోప‌ణ‌లు పెద్ద దుమార‌మే రేపుతున్నాయి.

 Janasena Party Started Targetting Ycp Minister Vellampalli Srinivas Illegal Works-ఆ మంత్రిని టార్గెట్ చేసిన జ‌న‌సేన‌.. వార్ షురూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంత్రి కావాల‌నే ఇప్పుడున్న తాడేపల్లిలోని క్యాపిటల్ బిజినెస్ పార్క్ కు మేలు చేసే క్ర‌మంలో జీవో 61ను తీసుకొచ్చి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.మంత్రితో స‌హా న‌లుగురు బిజినెస్ పార్టనర్స్ క‌లిసి వెల్లంపల్లి పక్కనే నివాసం ఉంటున్నార‌ని వారికి ల‌బ్ధి చేకూర్చే ప‌నిలో భాగంగానే జీవో నెంబ‌ర్ 61 ద్వారా దాదాపు రూ.30 కోట్ల రూపాయల స‌బ్సిడీ కింద మేలు చేశార‌ని మంత్రిపై జ‌న‌సేన ప్ర‌తినిధి మ‌హేశ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.మంత్రి త‌న బ‌ల‌గంతో విజయవాడలోని వస్త్రలత కాంప్లెక్స్ ని ఖాళీ చేపించి మ‌రీ దాన్ని బిజినెస్ పార్క్ కు మ‌ళ్లించి నిధులు స్వాహా చేయించేందుకు రెడీ అయిన‌ట్టు తెలిపారు.

Telugu Ap Cm Jagan, Ap Politics, Business Park, Go 61, Illegal Works, Janasena, Janasena Party, Janasena Pothina Mahesh, Pawan Kalyan, Targetting, Vellampalli Srinivas, Ycp, Ycp Minister-Telugu Political News

ఒక‌వేళ మంత్రి ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోతే ఈ అక్ర‌మాల‌తో ఆయ‌న‌కు సంబంధం లేక‌పోతే విజయవాడ కనక దుర్గమ్మపై ప్రమాణం చేసి త‌న నిజాయితీని నిరూపించుకోవాలని అప్పుడే ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని లేదంటే త‌ప్పు చేసిన‌ట్టే అంటూ మహేష్ స‌వాల్ విస‌ర‌డం ఇప్పుడు రాజ‌కీయంగా మ‌ళ్లీ ప్ర‌మాణాల‌ను తెర‌మీద‌కు తెచ్చిన‌ట్టు అయింది.మ‌రి ఈయ‌న స‌వాల్‌పై మంత్రిగానీ లేదా ఆయ‌న అనుచ‌రులు గానీ ఏమైనా స్పందిస్తారా అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.ఏదేమైనా జ‌న‌సేన మ‌ళ్లీ ట్రాక్ ఎక్కింద‌నేది చెప్పొచ్చు.

#GO 61 #YCP Minister #Pawan Kalyan #Targetting #Janasena Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు