ఆ ఒక్కటీ సరిచేసుకుంటే జనసేనకు తిరుగు లేనట్టే ?

లక్షలాది మంది అభిమానులు, బలమైన సామాజిక వర్గం అండదండలు అన్నీ ఉన్నా, జనసేన పార్టీ అధికారం వైపు నడిచే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవలసి వస్తోంది.జనసేన పార్టీని స్థాపించి చాలా కాలమే అయింది పార్టీ స్థాపించిన తర్వాత రెండు పార్టీలు ఏపీలో అధికారాన్ని దక్కించుకున్నాయి.

 Janasena Chief Pawaan Kalyan Political Future, Pawan Kalyan, Janasena Party, Pol-TeluguStop.com

కానీ జనసేన మాత్రం రాజకీయంగా బలోపేతం అవ్వడం లో విఫలం అయింది.పార్టీని ముందుకు నడిపించే క్రమంలో పవన్ ఎన్నో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవడం, ఒకవైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలు అన్నట్లుగా పవన్ రాజకీయ ప్రస్థానం ముందుకు వెళ్తుండటం, పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులు కొరత, ఇలా ఎన్నో కారణాలతో జనసేన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.2014 టిడిపి బిజెపీ కూటమికి పవన్ మద్దతు పలికారు.ఆ పార్టీలు అధికారం దక్కించుకునే విధంగా తన వంతు సహకారం అందించారు.

ఇక ఆ తరువాత పార్టీని బలోపేతం చేసే విషయంలో పవన్ తడబాటుకు గురవడంతో, అసలు సమస్య మొదలైంది.
పూర్తిగా టిడిపి ప్రభుత్వం తప్పిదాలను సైతం వెనకేసుకొచ్చినట్టు గా వ్యవహరించడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించకపోవడం ఇలా ఎన్నో కారణాలు జనసేనకు రాజకీయంగా ఇబ్బందులు తీసుకు వచ్చాయి.

దీంతో ఇతర పార్టీలలో నాయకులు ముందుగా జనసేన వైపు వెళ్లేందుకు ప్రయత్నించినా, చాలా మంది వెనక్కి తగ్గారు.ఇక తాజాగా బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకోవడం, వారు జనసేన ను పట్టించుకోనట్టు గా వ్యవహరించడం, ఇలా ఎన్నో కారణాలతో జనసేనలోకి చేరికలు పెద్దగా లేకుండా పోయాయి.

ఇక ఆ పార్టీలో బలమైన నాయకులు కొరత ఎక్కువగా కనిపిస్తోంది.పవన్ తప్ప ఆ పార్టీలో ఆ స్థాయిలో ప్రజాబలం ఉన్న నాయకుడు మరొకరు కనిపించకపోవడం, రాజకీయ వ్యూహాలు వేయడంలో పవన్ విఫలం అవ్వడం ఇలా ఎన్నో కారణాలు జనసేన రాజకీయంగా బలపడకుండా చేస్తున్నాయి.

ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లేవారు తప్ప, పార్టీలోకి వచ్చే నాయకుల సంఖ్య లేకపోవడం, కాస్తో కూస్తో ప్రజాదరణ ఉన్న నాయకులు సైతం జనసేన కు రాజకీయ భవిష్యత్తు లేదనే అభిప్రాయానికి వచ్చేయడం , ఇలా ఎన్నో కారణాలతో జనసేన ఏపీలో బల పడలేక పోతోంది.

Telugu Janasenapawaan, Janasena, Pawan Kalyan, Ycp-Political

 ప్రస్తుతం పవన్ సినిమాల పైనే ఎక్కువగా దృష్టి సారించారు.మరోవైపు చూస్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు, కొన్ని చోట ఉప ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.అదే జరిగితే జనసేన పోటీ చేసే పరిస్థితుల్లో ఉందా ? పోటీ చేస్తే గెలుపు పై ధీమా ఉందా ? అంటే లేదనే చెప్పాలి.ఇప్పటికైనా పవన్ ప్రజాదరణ కలిగిన నాయకులను జనసేన వైపు తీసుకు వచ్చి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయగలిగితే జనసేన కు తిరుగుండదు.అలాకాకుండా, కేవలం తన ఇమేజ్ ఆధారంగానే  పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తే జనసేన కు రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube