పవన్ కళ్యాణ్ గేమ్ స్టార్ట్..ఆపరేషన్ ఆకర్ష్

జనసేన పార్టీ పుట్టి ఐదేళ్ళు అవుతున్నా సరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తోంది మాత్రం 2019 నుంచీ అయితే ఈ ఐదేళ్ళ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల మీద పార్టీల గమనం ,తీరు తెన్నులపై అవగాహన ఏర్పరుచుకున్నాడు.ఏపీ రాజకీయాలలో ఎలా ఉంటే పార్టీని నడిపించగంలం.

 Janasena Party Operation Aakarsh Will Started-TeluguStop.com

సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి.అనే విషయాలపై ఇప్పటికే ఒక పక్క వ్యూహంతో సర్వం సిద్దం అయ్యాడు.

అంతేకాదు ఒక పార్టీలో ఉండే బలమైన నేతలని ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఏపీ రాజకీయాలని బాగా అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీ బలోపేతానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు అందుకోసం అనుభవజ్ఞులైన నేతలని తన పార్టీలోకి వచ్చేలా వ్యూహాలు పన్నుతూ ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టాడు .అయితే ఇందుకోసం తెలుగుదేశం పార్టీనే తన టార్గెట్ గా చేసుకున్నాడు.

తెలుగుదేశం పార్టీలో ఉండే బలమైన నాయకులని.

అదేవిధంగా ప్రజల మద్దతు ఉన్న నేతల లిస్టు రెడీ చేసుకున్నాడట వారితో కొంతమందితో ఇప్పటికే పవన్ తన పార్టీ వారితో టచ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది.అంతేకాదు బీజేపి పార్టీ నుంచీ కూడా కొంతమంది సీనియర్ లీడర్స్ సైతం పవన్ తో టచ్ లో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

అయితే వైసీపి ఇప్పుడు ఏపీలో బలంగా ఉంది కాబట్టి వైసీపి నేతలకి పవన్ గేలం వేయడం లేదని అయితే ఎవరైనా సరే వైసీపి నుంచీ వస్తాము అంటే మాత్రం తప్పకుండా ఆహ్వనిస్తామని అభిప్రాయాన్ని తెలుపుతున్నారు జనసేన వర్గాలు.

అయితే ఈ వ్యాఖ్యలకి బలం చేకూరేలా తాజాగా జేసీ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం రేకెత్తిస్తున్నాయి.

కొన్ని నెలల క్రితం జనసేన తరపున పవన్ కల్యాణ్ దూతలు తన వద్దకు వచ్చి పార్టీ మారమని బలవంత పెట్టారని జేసీ చెప్పుకొచ్చారు.అయితే తను ఆ అవకాశాన్ని వద్దనుకున్నాను అని వెల్లడించారు.

అయితే త్వరలోనే జనసేన పార్టీ ఆపరేష ఆకర్ష్ మొదలవుతుందని టిడిపి నుంచీ భారీ చేరికలు ఉంటాయనేది జనసేన వర్గాలు చెప్తున్నాయి.మరి ఈ విషయంలో టిడిపి పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube