టిడిపికి జనసేన తో పొత్తు లేనట్లే

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.శాశ్వత శత్రువులు ఉండరు అంటారు అది నూటికి నూరు శాతం వాస్తవం.

 Janasena Party No Alliance With Any Local Political Party’s-TeluguStop.com

అలాంటి సంఘటనలు ఎన్నికలు ముందు చాలా బహిర్ఘాతం అవుతాయి.అవి చూసిన సామాన్య ప్రజలు షాక్ అవడం తప్ప మరేమీ ఉండదు

ఇప్పుడు తెలుగురష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ జనసేన పార్టీ.

జనసేన అధ్యక్షుడు పవన్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనున్నారు అనేది చాలా సస్పెన్స్ గా మారింది.అసలు పొత్తు ఉంటుందా లేదా ఉంటే ఎవరితో ఉంటుంది.

అనే చర్చ రాజకీయ నాయకుల్లో తీవ్రంగా జరుగుతోంది.అయితే టిడిపి కే జనసేన సపోర్ట్ ఉంటుంది అనుకోవడంలో పెద్ద ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే నిన్న మొన్నటి వరకూ వీరి ఇరు పార్టీల మధ్య ఉన్న రిలేషన్ ఆ దిశగా సందేహాలని రేకెత్తిస్తుంది.కానీ ఇప్పుడు జనసేన ఎలా అడుగులు వేయాలి అని మధన పడుతోందని తెలుస్తోంది

టిడిపికి పాలనకి ఐదేళ్ళు నిండుతున్నాయి.

ప్రజలు మళ్ళీ చంద్రబాబు కి పట్టం కడుతారో లేదో తెలియదు.ఒక వేళ అధికారాన్ని ప్రజలు టిడిపికి ఇవ్వకూడదు అనుకుంటే.

అటువంటి సమయంలో టిడిపితో కలిసి నడవడం జనసేన మనుగడకే ప్రమాదం.అలా కాకుండా వైసీపితో దోస్తీ కట్టే అవకాశం లేదా అనుకుంటే అది కూడా తీసిపారేయలేము ఎందుకంటే.

చాలా సార్లు పవన్ కానీ జనసేన నాయకులు కానీ విధానాలు అనుకూలిస్తే జనసేన తో కలిసి అయినా నడుస్తాం అని.కానీ ఒకవేళ వైసీపిని ప్రజలు అంగీకరించని పక్షంలో మనం చాల నష్టపోతాం అనే ఆలోచన కూడా వారిలో ఉంది.మరి ఇద్దరితో ఒకరితో పొత్తు పెట్టుకుంటే జనసేన కి లాభమా నష్టమా అనుకునే విశ్లేషణ చేస్తున్నారు విశ్లేషకులు.

ఒకవేళ టిడిపితో పవన్ పొత్తు పెట్టుకుంటే.

ప‌వ‌న్‌కు 30 సీట్ల‌కు లోపుగానే సీట్లు కేటాయించే ఛాన్సులు ఉన్నాయి.ఎందుకంటే జనసేన అధినాయకుడికి తెలుసు తమ బలం రాష్ట్రంలో అంతగా ప్రభావితం చేయలేదు కేవలం కొన్ని చోట్ల మాత్రమే మనం సత్తా చాటగలం అని.అయితే ఉన్నా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప‌వ‌న్‌కు ఎంత వ‌ర‌కు లాభం అన్న లెక్క‌లు వేసుకుంటే ఈ పొత్తు జ‌న‌సేన కంటే టీడీపీకే చాలా లాభం అన్న చ‌ర్చ‌లు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి.ప‌వ‌న్‌కు ఇచ్చే సీట్లు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు, టీడీపీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు, ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు ఇచ్చి చంద్ర‌బాబు స‌రిపెట్టేస్తార‌న్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి

టిడిపితో పొత్తు పెట్టుకుంటే.2009 ఎన్నిక‌ల్లో టిడిపి టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని సీట్లని ఎలా ఇచ్చింది అన్న కోణంలో ఆలోచిస్తే మనం పరిస్థితి కూడా ఇలానే అవుతుంది అని భావిస్తున్నట్టుగా సమాచారం.అందుకే పొత్తుల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా.

చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఎదిఎమైనా రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కింగ్ మేకర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.

వచ్చే ఎన్నికల్లో పవన్ రాకతో ఓట్లు చీలడం ఖాయం కాకపోతే అది ఎవరికీ లాభం.ఎవరికీ నష్టం అనేది పవన్ పెట్టుకునే పొత్తు పై ఆధారపడి ఉంది.

అయితే విశ్లేషకులు మాత్రం జనసేన ఎక్కడ బలంగా ఉందొ చూసుకుని అక్కడ తమ అభ్యర్ధులని పోటీ చేయిస్తే 2019 రాజకీయాలు జనసేన చుట్టూ తిరుగుతాయని విశ్లేషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube