టిడిపికి జనసేన తో పొత్తు లేనట్లే     2017-11-02   22:15:09  IST  Bhanu C

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులు ఉండరు అంటారు అది నూటికి నూరు శాతం వాస్తవం..అలాంటి సంఘటనలు ఎన్నికలు ముందు చాలా బహిర్ఘాతం అవుతాయి.అవి చూసిన సామాన్య ప్రజలు షాక్ అవడం తప్ప మరేమీ ఉండదు..

ఇప్పుడు తెలుగురష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ జనసేన పార్టీ..జనసేన అధ్యక్షుడు పవన్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనున్నారు అనేది చాలా సస్పెన్స్ గా మారింది.అసలు పొత్తు ఉంటుందా లేదా ఉంటే ఎవరితో ఉంటుంది..అనే చర్చ రాజకీయ నాయకుల్లో తీవ్రంగా జరుగుతోంది.అయితే టిడిపి కే జనసేన సపోర్ట్ ఉంటుంది అనుకోవడంలో పెద్ద ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు..ఎందుకంటే నిన్న మొన్నటి వరకూ వీరి ఇరు పార్టీల మధ్య ఉన్న రిలేషన్ ఆ దిశగా సందేహాలని రేకెత్తిస్తుంది.కానీ ఇప్పుడు జనసేన ఎలా అడుగులు వేయాలి అని మధన పడుతోందని తెలుస్తోంది.

టిడిపికి పాలనకి ఐదేళ్ళు నిండుతున్నాయి..ప్రజలు మళ్ళీ చంద్రబాబు కి పట్టం కడుతారో లేదో తెలియదు..ఒక వేళ అధికారాన్ని ప్రజలు టిడిపికి ఇవ్వకూడదు అనుకుంటే..అటువంటి సమయంలో టిడిపితో కలిసి నడవడం జనసేన మనుగడకే ప్రమాదం..అలా కాకుండా వైసీపితో దోస్తీ కట్టే అవకాశం లేదా అనుకుంటే అది కూడా తీసిపారేయలేము ఎందుకంటే..చాలా సార్లు పవన్ కానీ జనసేన నాయకులు కానీ విధానాలు అనుకూలిస్తే జనసేన తో కలిసి అయినా నడుస్తాం అని..కానీ ఒకవేళ వైసీపిని ప్రజలు అంగీకరించని పక్షంలో మనం చాల నష్టపోతాం అనే ఆలోచన కూడా వారిలో ఉంది.మరి ఇద్దరితో ఒకరితో పొత్తు పెట్టుకుంటే జనసేన కి లాభమా నష్టమా అనుకునే విశ్లేషణ చేస్తున్నారు విశ్లేషకులు.