జనసేన పార్టీ ఎమ్మెల్యే వైకాపా వైపు చూస్తున్నాడా...?

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరూ ఊహించని విధంగా ఓటమి పాలై ఒక్క సీటుతో సరిపెట్టుకున్న సంగతి తేలింది.అయితే ప్రస్తుతం జనసేన పార్టీలోని పరిస్థితులను బట్టి చూస్తే ఆ ఒక్క సీటు కూడా జనసేన పార్టీలో నిలబడేట్లు లేదు.

 Janasena Party Mla Vara Prasada Rao Pawan Kalyan Ys Jagan-TeluguStop.com

తాజాగా జనసేన పార్టీకి సంబందించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు  మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాపాక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై  సంచలన వ్యాఖ్యలు చేసారు. 

Telugu Andhrapradesh, Janasenamla, Jaansena, Pawan Kalyan, Rapakavara, Ysjagan,

రాష్ట్రంలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ దీక్ష చేపట్టినా పది లేదా ఇరవై మంది జనం మాత్రమే వస్తారని అంత కంటే ఎక్కువ మంది రారని అన్నారు.అంతేగాక ప్రతి చిన్న విషయానికి ధర్నాలు, సభలు పెట్టి కాలాన్ని వృథా చేయడం సరి కాదని తప్పుబట్టారు.ఒక వేళ ఇలా చేస్తే ముందు ముందు ఇలాంటి సభలకు, ధర్నాలకు ఆదరణ తగ్గిపోతుందని అన్నారు. 

అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళల భద్రత దృష్ట్యా దిశ యాక్ట్ చట్టాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసేందే.అయితే ఈ చట్టానికి ఎమ్మెల్యే రాపాక మద్దతు తెలిపి ముఖ్య మంత్రిపై ప్రశంసలు కురిపించారు.

అంతేగాక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ పెట్టాలనుకున్న అంశాన్ని కూడా సమర్థించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాపాక వర ప్రసాద్ రావు సమర్థించిన ఈ రెండు అంశాలు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినవే.

అలాగే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కాకినాడలో రైతులకు అండగా నిలబడడానికి చేసిన రైతు సౌభాగ్య దీక్షకు కూడా రాపాక వర ప్రసాద్ రావు హాజరు కాలేదు.దీంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రాపాక కి షోకాజ్ నోటీసులు కూడా పంపించారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాపాక తన వ్యక్తి గత కారణాల వల్లనే రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కాలేదని అంత మాత్రాన షోకాజ్ నోటీసులు పంపడం సరి కాదని అన్నారు.ఈ పరిణామాలని బట్టి చూస్తే తొందరలోనే ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ రావు వైకాపా తీర్థం పుచ్చుకోనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube