ఏపీలో జ‌న‌సేన గెలిచే సీట్ల లెక్క ఇదే

ఏపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ సాధించే సీట్ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది.

 Janasena Party Mla Seats List-TeluguStop.com

వాస్త‌వానికి చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీతోనే యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌.ఆ త‌ర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో దూర‌మ‌య్యారు.

ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో సొంతంగా జ‌న‌సేన పేరుతో పార్టీని స్థాపించాడు ప‌వ‌న్‌.అయిన‌ప్ప‌టికీ.

అప్ప‌ట్లో పోటీకి దూరంగా ఉండిపోయాడు.అయితే, ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతూ ప‌లు స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తున్న ప‌వ‌న్‌కి ఇటీవ‌ల కాలంలో ఫాలోయింగ్ భారీ ఎత్తున పెరిగింది.

ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.అంటూ రాష్ట్రంలోని ఓ ద‌మ్మున్న ఛానెల్ మొన్నామ‌ధ్య స‌ర్వే చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది.

ఈ మీడియా సొంత లెక్క‌ల్లో ఒక్క చంద్ర‌బాబు గారికి త‌ప్ప ఎవ‌రికీ రాష్ట్రంలో ఓట‌ర్లు మ‌ద్ద‌తివ్వ‌డం లేద‌ని తేల్చి చెప్పింది.అంతేకాకుండా.

ప‌వ‌న్ పార్టీకి ప్ర‌జ‌లు ఏమంత మ‌ద్ద‌తివ్వ‌డం లేద‌ని కూడా పేర్కొంటూ కొన్ని లెక్క‌లు వెల్ల‌డించింది.అయితే, దీనిని స‌వాలు తీసుకున్నారో ఏమో జ‌న‌సేన నేత‌లు తాము కూడా సొంతంగా ఓ స‌ర్వే చేయించుకున్నారు.

దీనిలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.అనే రేంజ్‌లో స‌ర్వే చేయించార‌ట‌.

తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంట‌రిగా బ‌రిలోకి దిగితే.ఎలాంటి రిజల్ట్ వ‌స్తుందో చూసుకున్నార‌ట‌.

ఇదే విష‌యంపై మాట్లాడిన జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి క‌ళ్యాణ్ దిలీప్ సుంక‌ర‌.జ‌న‌సేన లెక్క‌లు వివ‌రించారు.

రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లోనూ ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.57 నుంచి 62 స్థానాలు ప‌క్కాగా త‌మ బుట్ట‌లో ప‌డ‌తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.అంతేకాదు, ఈ సంద‌ర్భంగా ఆయ‌న ద‌మ్ముఛానెల్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.తాము ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోకుండానే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.మ‌రి ఇదీ జ‌న‌సేన లెక్క‌! ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube