ముంచుకొస్తున్న గడువు.. జనసేనాని చేతులు ఎత్తేస్తాడా...??  

Janasena Party Mla And Mp Candidates-janasena Party,mla And Mp Candidates,pawan Kalyan

జనసేన అధినేత వ్యవహారం చూస్తుంటే రోజుకో మాట పూటకో వేషం అనేట్టుగా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు బాసు అంటే తూచ్ సమయం లేదు అంటూ వివరణ ఇచ్చిన పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏపీలో 175 స్థానాల్లో అభ్యర్ధులని నిలబెట్టడానికి తర్జనభర్జన పడుతున్నాడు. ఏపీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా వ్యవహారం పవన్ నడిపేలా ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ప్రతీ ఒక్కరిలో...

ముంచుకొస్తున్న గడువు.. జనసేనాని చేతులు ఎత్తేస్తాడా...??-Janasena Party MLA And MP Candidates

దాంతో జనసేన అభిమానుల్లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇదిలాఉంటే 18వ తేదీ నుంచి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రధాన పార్టీలైన టీడీపీ , వైసీపీ లు దాదాపుగా అభ్యర్థులను ఎంపిక చేశాయి, కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేసినా ఒకటి రెండు రోజుల్లో వారిని కూడా ఖరారు చేసి ప్రకటించే పనిలో ఉన్నారు ఆయా పార్టీల అధినేతలు. కానీ నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఇప్పటికీ అభ్యర్థుల కోసం వెతుక్కునే ఉన్నారు.

ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలకు గాను 1200 దరఖాస్తులు వచ్చాయని చంకలు గుడ్డుకుంటున్న జనసేన పార్టీకి అభ్యర్ధుల కరువు ఏమిటో అర్థం కాని పరిస్థితి. నిజానికి రాజకీయాల్లో టికెట్లు ఇవ్వడానికి ఇలా దరఖాస్తు చేసుకోవడం సరైన పద్ధతి కాదు. ముందుగా ప్రజల్లో అంతో ఇంతో గుర్తింపు ఉన్న అభ్యర్థిని నిలబెడితే ప్రయోజనం ఉంటుంది కానీ ఇలా కమిటీలు వేసి ఎంపిక చేస్తే జనసేన పరువు ఓట్ల లెక్కింపులో కొట్టుకుపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అయితే గెలుపు గుర్రాలను కేవలం స్క్రీనింగ్ కమిటీల ద్వారా ఎంపిక చేయాలని అనుకోవడం జనసేన అధినేత మూర్ఖ నిర్ణయానికి నిదర్శనంగా కనిపిస్తోంది.

అభ్యర్థుల ఎంపికలోనే ఇలాంటి తడబాట్లు ప్రయోగాలు ఉంటే ఇక రాష్ట్రాన్ని పవన్ చేతికి అప్పగిస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచీ అభ్యర్థుల ఎంపికపై మీనమేషాలు లెక్కపెట్టిన పవన్ కళ్యాణ్ సమయం ముంచుకొచ్చిన క్రమంలో చేతులు ఎత్తేసే పరిస్థితి కన్పిస్తోందని అంటున్నారు.ఇప్పటి వరకూ ఎంపిక కాబడిన అభ్యర్ధులు అధికశాతం ఉభయగోదావరి జిల్లాల వాళ్ళు ఉండటం గమనార్హం...

అయితే పార్టీలో ఈ రకమైన పరిస్థితితో నేతల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. అసలు నమ్ముకున్న పార్టీని వదులుకుని ఎందుకు వచ్చామా అంటూ పవన్ పై గుర్రుగా ఉన్నారట కొందరు నేతలు.

అసలు జనసేనలో ఎవరు ఉన్నారు, ఎన్ని కమిటీలు ఉన్నాయి. ఎవరిని పవన్ ఎలా ఉపయోగిస్తున్నాడో ఓ క్లారిటీ అయినా ఉందొ లేదో కానీ, నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నేతలు ఉన్న పక్కన పెట్టుకుని తిట్టుకోవడం తప్ప జనసేన అధినేత ఉపయోగించుకున్నది లేదు ఇలా కాలయాపన చేస్తూ కేవలం అభిమానులను చూసుకుని చంకలు గుద్దుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అన్న కంటే కూడా ఘోరమైన వైఫల్యాన్ని ఎదుర్కునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ పండితులు.

మరి చివరకి పవన్ చేతులు ఎత్తేసి మళ్ళీ టీడీపీ తో పొత్తు పెట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు.