రాజధానిపై జనసేనాని కీలక సమావేశం! భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం

పార్టీ భవిష్యత్తు, సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలని దృష్టిలో పెట్టుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.ఈ పొత్తు ఏపీ రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాలకి పెద్ద ఇబ్బందికర వాతావరణం సృష్టించింది.

 Janasena Party Meeting In Tomorrow-TeluguStop.com

ఇదిలా ఉంటే జనసేన పొత్తుని సహించలేకపోతున్న అధికార వైసీపీ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తుంది.ఇదిలా ఉంటే మరో వైపు ఎలా అయిన రాజధానిని తరలించి మూడు రాజధానులని ప్రజలపై బలవంతంగా రుద్దడానికి రెడీ అయిన వైసీపీ సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది.

అయితే చాలా వరకు క్యాపిటల్ రాజధానిగా విశాఖని ప్రకటించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

ఈ సమావేశం నేపధ్యంలో జనసేన పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది.

పవన్ కళ్యాణ్ అద్యక్షతన మంగళగిరిలో పార్టీ కీలక నేతలతో ఈ సమావేశం జరుగుతుంది.ఈ సమావేశంలో ముఖ్యంగా రాజధానిపై అధికారి నిర్ణయం తర్వాత ఎలాంటి స్టాండ్ తీసుకోవాలని అనే అంశాన్ని చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.

తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకి సంబందించిన కార్యాచరణ, బీజేపీతో కలిసి ఉమ్మడి కార్యాచరణ, ప్రయాణంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.ఇక ఇప్పటికే బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ కావడంతో పార్టీని ఈ నాలుగేళ్ల కాలంలో ఎలా నిర్పించుకోవాలి.

అనే విషయాల మీద చర్చించనున్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా జనసేన పార్టీ తరుపున జరగబోయే రేపటి సమావేశం మీద మీడియా కూడా ఆసక్తి చూపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube