అదే జరిగింది : జనసేనకు ఆయన కూడా గుడ్‌ బై చెప్పేశాడు

మొన్నటి ఎన్నికలో ఘోర పరాభవం పాలయిన జనసేనకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేసి కనీసం ఒక్క చోట కూడా గెలవక పోడంతో ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా నమ్మకం కోల్పోతున్నారు.

 Janasena Party Leader Akula Satyanarayana Resign To Janasena Party-TeluguStop.com

పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో సీనియర్‌ నాయకులు అంతా మెల్ల మెల్లగా జారుకుంటున్నారు.ఇప్పటికే రావెల కిషోర్‌ బాబు, అద్దెపల్లి శ్రీధర్‌, డెవిడ్‌ రాజు ఇంకా కొందరు నాయకులు కూడా పార్టీకి గుడ్‌ బై చెప్పారు.

తాజాగా వారి దారిలోనే రాజమండ్రి సీనియర్‌ జనసేన నాయకుడు ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.

ఎన్నికలు ముగిసినప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరం ఉంటున్నారు.

ఆయన్ను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నించినా కూడా ఆయన మాత్రం దూరంగానే ఉంటూ వచ్చాడు.దాంతో ఆయన పార్టీకి గుడ్‌ బై చెప్పడం కన్ఫర్మ్‌ అని అంతా అనుకున్నారు.

అనుకున్నట్లుగానే అదే జరిగింది.నేడు ఆయన తన పార్టీ ప్రాధమిక సభ్యత్వంకు మరియు ఇతర పార్టీ పదవులన్నింటికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌కు లేఖ రాశాడు.

ఆ లేఖలో కేవలం రాజీనామా చేస్తున్నట్లుగానే పేర్కొన్నాడు మినహా కారణం ఏంటీ, పార్టీ పరిస్థితి ఏంటీ అనే విషయాలపై ఆయన స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube