పవన్ కళ్యాణ్ కి ఘోర అవమానం! రెండు చోట్ల భారీ ఓటమి  

పోటీ చేసిన రెండు చోట ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. .

Janasena Party Huge Failure In Ap Elections-bhimavaram,gajuvaka,janasena,janasena Party Huge Failure,tdp,ysrcp

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఫలితాలు ఎవ్వరు ఊహించని విధంగా అందరికి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎన్నికలలో కచ్చితంగా ప్రభావం చూపించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన పార్టీకి ఎన్నికల ఫలితాలు ఊహించని పరాభవాన్ని మిగిల్చాయని చెప్పాలి..

పవన్ కళ్యాణ్ కి ఘోర అవమానం! రెండు చోట్ల భారీ ఓటమి-Janasena Party Huge Failure In AP Elections

జనసేన ఈ ఎన్నికలలో కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అని, కనీసం 20 నుంచి 30 స్థానాల వరకు తెచ్చుకొని ఏపీలో చక్రం తిప్పాలని భావించిన జనసేన పార్టీకి ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా పాతికేళ్ళ రాజకీయ లక్ష్యం పెట్టుకొని ఎన్నికలలో పోటీకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా ఊహించని పరాభవం ఈ ఎన్నికలలో ఎదురైంది అని చెప్పాలి.

ఈ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందస్తు జాగ్రత్తగా భీమవరంతో పాటు గాజువాకలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఇక రెండు స్థానాలలో కూడా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తాడని జనసేన అభిమానులు, కార్యకర్తలు భావించారు.

ఇక మెజారిటీ ఎ స్థాయిలో ఉంటుందో చూడాలని కూడా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ రెండు నియోజక వర్గాలలో పవన్ కళ్యాణ్ కి ఘోర అవమానం ఎదురైంది. రెండు చోట్ల పవన్ కళ్యాణ్ భారీ తేడాతో వైసీపీ అభ్యర్ధుల చేతిలో ఓడిపోయాడు.

కచ్చితంగా గెలుస్తాడని అనుకున్న గాజువాకలో అయితే మరీ దారుణమైన ఓటమిని పవన్ కళ్యాణ్ చవిచూసాడు. ఇక్కడ ఏకంగా మూడో స్థానానికి పవన్ కళ్యాణ్ పడిపోయాడు. ఇక ఓవరాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి ఘోర అవమానం ఎదుర్కొన్నాడు అని చెప్పాలి.