తెలంగాణ 26 నియోజకవర్గాల బాధ్యుల నాయకుల లిస్ట్ విడుదల చేసిన జనసేన పార్టీ..!!

జనసేన పార్టీ( Janasena Party ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఈరోజు ఉదయమే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం భూమి పూజ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేయడం జరిగింది.

 Janasena Party Has Released The List Of Incharge Leaders Of 26 Constituencies Of-TeluguStop.com

జూన్ 14 నుండి వారాహి యాత్ర( Varahi ) స్టార్ట్ చేయబోతున్నారు.పరిస్థితి ఇలా ఉంటే జనసేన కేంద్ర కార్యాలయంలో తాజాగా తెలంగాణ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 26 నియోజకవర్గాల బాధ్యుల నేతల వివరాలను తెలియజేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేయడం జరిగింది.” జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.ఉనికిని కాపాడుకుంటూ బలమైన భావజాలానికి కట్టుబడి ఉంటే మంచి రోజులు వాటంతట అవే వస్తాయని అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారు… వాళ్ల ఆకాంక్ష అయిన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజమన్నారు.

ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందన్నారు.

Telugu Janasena, Nagababu, Pawan Kalyan, Varahi-Telugu Political News

సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు.తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 26 నియోజకవర్గాలకు ఇంచార్జులని నియమించారు.వారందరికి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ యూత్ వింగ్ తో ప్రారంభమై… ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది.జనసేన భావజాలానికి ఆకర్షితులైన యువత ప్రతి గ్రామంలో ఉన్నారు.

ఆ భావాన్ని పట్టుకొని ముందుకెళితే ఏదైనా సాధించగలం.తెలంగాణ అభివృద్ధి సాధించాలి, ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలి అనేది జనసేన ఆకాంక్ష.

ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతమంది కొత్తవారికి అవకాశం ఇవ్వరు.అవకాశాన్ని సరదాగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని” అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యకులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం పాల్గొన్నారు.

Telugu Janasena, Nagababu, Pawan Kalyan, Varahi-Telugu Political News

26 నియోజకవర్గాల బాధ్యుల వివరాలు.

1.శ్రీ వేమూరి శంకర్ గౌడ్.( కూకట్ పల్లి)
2.

శ్రీ పొన్నూరు లక్ష్మి యి శిరీష(ఎల్బీనగర్)
3.శ్రీ వంగ లక్ష్మణ గౌడ్(నాగర్ కర్నూలు)
4.శ్రీ తేజవత్ సంపత్ నాయక్(వైరా)
5.శ్రీ మిరియాల రామకృష్ణ.(ఖమ్మం)
6.శ్రీ గోకుల రవీందర్ రెడ్డి(మునుగోడు)
7.శ్రీ నందగిరి సతీష్ కుమార్(కుత్బుల్లాపూర్)
8.డాక్టర్ మాధవరెడ్డి(శేరిలింగంపల్లి)

9)శ్రీ ఎడమ రాజేష్ (పటాన్ చెరువు)
10)శ్రీమతి మండపాక కావ్య (సనత్ నగర్)
11)శ్రీ వై.ఎమ్.ఎన్.ఎస్.ఎస్.వి నిహారిక నాయుడు(ఉప్పల్)
శ్రీ శివ కార్తీక్ (కో కన్వీనర్ )(ఉప్పల్)
12)శ్రీ వేముల కార్తీక్(కొత్తగూడెం)
13)శ్రీ డేగల రామచంద్రరావు(అశ్వరావుపేట)
14)శ్రీ శ్రీ వి.నగేష్(పాలకుర్తి)
15)శ్రీ మేరుగు శివకోటి యాదవ్(నర్సంపేట)
16)శ్రీ గాదె పృద్వి (స్టేషన్ ఘన్ పూర్)
17)శ్రీ తగరపు శ్రీనివాస్ (హుస్నాబాద్)
18)శ్రీ మూల హరీష్ గౌడ్ (రామగుండం)
19)శ్రీ టెక్కల జనార్ధన్ (జగిత్యాల)
20)శ్రీ చెరుకుపల్లి రామలింగయ్య (నకిరేకల్)
21)శ్రీయన్ నాగేశ్వరరావు(హుజూర్ నగర్)
22)శ్రీ మాయ రమేష్ (మంథని)
23)శ్రీ మేకల సతీష్ రెడ్డి(కోదాడ)
24)శ్రీ బండి నరేష్ (సత్తుపల్లి)
25).శ్రీ వంశీకృష్ణ (వరంగల్ వెస్ట్)
26)శ్రీ బాలు గౌడ్ (వరంగల్ ఈస్ట్)

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube