పరిమితంగానే పోటీ చేద్దాం ... మిగిలిన చోట బలపడదాం !

ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.ఏపీ లోని 175 అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ముందుగా పవన్ ప్రకటించారు.అయితే… ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సంస్థాగతంగా జనసేన పార్టీ పూర్తిస్థాయిలో బలపడకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో.కేవలం తమ పార్టీకి బలం ఉందని తేలిన కొన్ని నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు.

 Janasena Party Going With 175 Seats In This Elections-TeluguStop.com

అందుకే 175 స్థానాలున్న ఏపీలో కేవలం వంద సీట్లలో మాత్రమే తమ అభ్యర్థులను నిలబెట్టాలని పవన్ ఒక డెసిషన్ కి వచ్చాడు.పార్టీకి బలమైన క్యాడర్ లేని చోట తమ ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉండి జనసేన పార్టీ ఇవ్వలేదు అన్న చోట అభ్యర్థులను నెల పెట్టకూడదని పవన్ నిర్ణయించుకున్నాడు.

ఇదే విషయమై తన కోటరీ నాయకులతో పవన్ చర్చించినప్పుడు దాదాపు అందరూ ఇదే నిర్ణయాన్ని చెప్పారట.దీంతో ఇక ఆ విధంగానే ముందుకు వెళ్లాలని పవన్ దాదాపు ఫిక్స్ అయిపోయారు.తాము ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా… కర్ణాటకలో కుమారస్వామి పార్టీ ఏ విధంగా అయితే కింగ్ మేకర్ అయ్యిందో ఆ విధంగానే ఏపీలో జనసేన పార్టీ కూడా మారుతుందని పవన్ ఒక అంచనాకు ఎప్పుడో వచ్చారు.అందుకే… ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.తమకు బలం లేని చోట పోటీ చేస్తే తమ కలిసి రాక పోవడమే కాకుండా …అన్ని సీట్లలో పోటీ చేసినా… కేవలం కొన్ని సీట్లు మాత్రమే జనసేన గెలుచుకుందనే అపవాదు తమ పార్టీకి వస్తుందని పవన్ భావిస్తున్నారు…

జనసేన కొంచెం బలంగా ఉంది అనుకుంటున్న ఉత్తరాంధ్ర జిల్లాల తో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి మిగతా జిల్లాల్లో సామాజిక సమీకరణాలు…పార్టీకి అనుకూలత… సమర్థులైన అభ్యర్థులు ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకొని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలని జనసేనాని చూస్తున్నాడు.అంతే కాకుండా… వైసిపికి బలంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో పోటీ చేయాలా…? పోటీకి దూరంగా ఉండాలా .? అనే విషయంలో పవన్ ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు.అయితే… టిడిపి, వైసిపి పార్టీలు తమ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించగానే మరికొంతమంది పేర్లను ప్రకటించాలని పవన్ చూస్తున్నాడు.అందుకే ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేసి మిగతా నియోజకవర్గాల్లో నెమ్మదిగా బలపడాలని జనసేన పార్టీ చూస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube