నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం! మన నది-మన నుడి అంటూ కొత్త ఉద్యమం

పవర్ స్టార్ ఇమేజ్ తో సినిమా రంగంలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కి తెలుగునాట అశేషంగా అభిమాన గణం ఉంది.ఇక ఎప్పుడు కూడా సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలని దేశం కోసం నిలబడాలి అనే ఆలోచనలతో సామాజిక దృక్పథం ఉన్న హీరోగా అభిమానులకి పవన్ కళ్యాణ్ ఆరాధ్యంగా మారిపోయాడు.2014 ఎన్నికలకి ముంది అడ్డగోలు రాష్ట్ర విభజన చూసి భరించలేక కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.జనసేన పార్టీ పెట్టి తన రాజకీయ ప్రస్తానం మొదలెట్టారు.

 Janasena Party Formation Day Rajahmundry-TeluguStop.com

అయితే మొదటి ఎన్నికలలో పోటీ చేయకుండా కేవలం బీజేపీ-టీడీపీకి మద్దతు మాత్రమే ఇచ్చారు.అనంతరం కాలంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకి వచ్చి సమస్యల మీద పోరాటం చేసేవారు.

అయితే ప్రభుత్వ వైఫల్యాలని ఎండ గడుతూ 2017లో టీడీపీకి వ్యతిరేకంగా మారి.రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆ పార్టీని తూర్పారబట్టారు.

అధికార పార్టీ వైఫల్యాలని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళడంతో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది.ఇలాంటి సమయంలో గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన ఎన్నికల బరిలోకి దిగింది.

ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుంది అని అనుకున్న.ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా స్టాండ్ మార్చుకొని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మీద విమర్శలు మొదలెట్టడంతో పవన్ కళ్యాణ్ వ్యూహం పూర్తిగా దెబ్బతిని కేవలం తను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి ఒక్క సీటుకి పరిమితం అయిపోయారు.

అయితే ఎన్నికలలో ఓటమి తర్వాత మరల ప్రజల మధ్య కి వచ్చి సామాజిక సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం మొదలెట్టారు.ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో ఆరేళ్ళు పూర్తి చేసుకున్న జనసేన పార్టీ నేడు ఆవిర్భావ సభకి సిద్ధం అవుతుంది.

రాజమండ్రిలో ఒక హోటల్ లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం ద్వారా మన నది-మన నుడి అనే నినాదంతో తెలుగు మాధ్యమం పరిరక్షణ ఉద్యమంకి శ్రీకారం చుట్టబోతున్నారు.

అదే సమయంలో ఆరేళ్ళ కాలంలో జనసేన ప్రయాణం, ఎన్నికలలో వైఫల్యాలకి కారణాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో జనసేనాని సమీక్ష చేసుకోనున్నారు.బహిరంగ సభలో ఆవిర్భావ కార్యక్రమం జరుపుకునే స్థాయి నుంచి హోటల్ లో ఆవిర్భావ వేడుకలకి పడిపోయిన జనసేన ఇమేజ్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఈ ఆవిర్భావ సభ ద్వారా జనసేన క్యాడర్ ని పవన్ కళ్యాణ్ ఎం చెబుతాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube