రావెల కిషోర్ బాబు పార్టీ వీడటంపై జనసేన కార్యకర్తల అభిప్రాయం ఎలా ఉందంటే  

రావెల కిషోర్ బాబుతో పార్టీకి ఎలాంటి నష్టం లేదు అంటున్న జనసేన కార్యకర్తలు. .

Janasena Party Don\'t Have Any Damage With Ravela Kishor Babu-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసి తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అతని రాజకీయ భవిష్యత్తుకి పునాదులు వేసింది.అయితే తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఓట్ల రూపంలో కనిపించిన కూడా అసెంబ్లీలో అడుగు పెట్టే స్థాయిలో ఎక్కువ సీట్లు సొంతం చేసుకోలేక పోయింది..

Janasena Party Don\'t Have Any Damage With Ravela Kishor Babu--Janasena Party Don't Have Any Damage With Ravela Kishor Babu-

కేవలం ఒకే ఒక్క స్థానంలో జనసేన పార్టీ గెలిచి ఓకే అనిపించుకుంది.ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత జనసేన పార్టీలో పని చేసిన చాలామంది నేతలు ఆ పార్టీని వీడటం మొదలుపెట్టారు.తాజాగా టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి రాజీనామా చేసి బిజెపి కండువా కప్పుకున్నారు.

జనసేన పార్టీని వీడిన తర్వాత రావెల కిషోర్ బాబు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు రావెల కిషోర్ బాబు పోటీ చేసిన పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు అతను పార్టీ వీడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రావెల కిషోర్ బాబు పార్టీని వేయడం వల్ల కలిగే పార్టీకి ఎలాంటి నష్టం లేదని అతను ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్లిపోయాడని అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతనికి పార్టీలో సముచిత స్థానం ఇచ్చినా కూడా కేవలం అధికార కాంక్షతోనే పార్టీ మారిపోయారని రావెల కిషోర్ బాబు మీద ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన నేతలు విమర్శించారు.జనసేన ప్రస్తుతం ఓడిపోయిన భవిష్యత్తులో కచ్చితంగా బలమైన శక్తిగా ఎదుగుతుందని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.