పవన్ కు జెడ్ కేటగిరీ భద్రత.. నిజమేనా..?

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నిన్నటినుంచి ఒక వార్త సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఒకవైపు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ మరోవైపు సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాల్లో నటిస్తున్న పవన్ కు కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తోందని ఆ వార్త సారాంశం.22 మంది జాతీయ స్థాయి కమాండోలను పవన్ కోసం కేంద్రం కేటాయించినట్టు గాసిప్స్ గుప్పుమన్నాయి.
అకస్మాత్తుగా పవన్ కు జెడ్ కేటగిరీ భద్రత అంటూ వస్తున్న వార్తలు పవన్ అభిమానులను కూడా ఒకింత కంగారు పెట్టాయి.

 Janasena Party Condemns Rumors On Z Category Security To Pawan Kalyan, Pawan Kal-TeluguStop.com

కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పవన్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాల డీజీపీలకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించినట్టు నిన్నటినుంచి విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూమర్లపై జనసేన కార్యాలయం స్పందించి కీలక వ్యాఖ్యలు చేసింది.సోషల్,వెబ్ మీడియాలో పవన్ జెడ్ కేటగిరీ భద్రత గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని జనసేన కార్యాలయం పేర్కొంది.

పార్టీ తరపున పవన్ కానీ, ఇతర నేతలు కానీ జెడ్ కేటగిరీ భద్రత కోరలేదని.ఎవరూ కూడా పవన్ ను జెడ్ కేటగిరీ భద్రత గురించి సంప్రదించలేదని జనసేన కార్యాలయం తెలిపింది.

మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతుల వల్ల నెటిజన్లు పవన్ కు ఏ అర్హత ఉందని జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం అనుకుందని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.మరికొందరు బీజేపీ జనసేన పార్టీల పొత్తే పవన్ కు భద్రత కల్పించడానికి కారణమని ప్రచారం చేశారు.

అయితే చివరకు జెడ్ కేటగిరీ భద్రత వార్తే ఫేక్ అని తేలడంతో విమర్శలు చేసిన వాళ్లు సైలెంట్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube