జనసేన మొదటి జాబితా..!!! కొన్ని స్థానాలే పరిమితమా..??  

Janasena Party Candidates List Is Ready To Announce-elections In Ap,janasena Candidates List,janasena First List,janasena Party,pawan Kalyan Janasena,ycp Candidates,ys Jagan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో ప్రజాపోరాట యాత్రలు చేప్పట్టిన పవన్ కళ్యాణ్ కొంత సమయం తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలతో పార్టీ ఆఫీసులో సమావేశాలు నిర్వహిస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేసిన తర్వాత ఇప్పుడు మళ్లీ జిల్లాల పర్యటనలు చేస్తున్నాడు. కొంత గ్యాప్ తరువాత పవన్ చేస్తున్న యాత్రలకి భారీగానే ప్రజాదరణ లభిస్తోంది..

జనసేన మొదటి జాబితా..!!! కొన్ని స్థానాలే పరిమితమా..??-Janasena Party Candidates List Is Ready To Announce

అయితే తన పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించడం లో మాత్రం వెనుకబడిన పవన్ కళ్యాణ్ తన పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడానికి ఒక రోజును ఎంచుకున్నారని తెలుస్తోంది. జనసేన పార్టీ నుంచి పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు నుంచి దరఖాస్తులను స్వీకరించిన స్క్రీనింగ్ కమిటీ, ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేసిందో చూచాయిగా కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించడానికి పవన్ కళ్యాణ్ మార్చి 14న రాజమండ్రిలో జరగబోయే పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ సభ నుంచి వెల్లడించనున్నారని తెలుస్తోంది.

ఇక్కడే పవన్ కళ్యాణ్ టిడిపి వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. 1994 లో ఎన్టీఆర్ ఇదే గ్రౌండ్ నుంచి తన ఎన్నికల శంఖారావం పూరించారు. ఆనాడు ఎన్టీఆర్ అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది కాంగ్రెస్ ని చావు దెబ్బ కొట్టారు..

దాంతో కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి వచ్చింది. దాంతో పవన్ కూడా ఈ గ్రౌండ్ ని సెంటిమెంట్ గా తీసుకుని ఇక్కడి నుంచే అభ్యర్థులను ప్రకటించాలని ఫిక్స్ అయ్యారట.

ఇదిలా ఉంటే 1994లో ఉన్న పరిస్థితులు వేరని, అప్పటి కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత వేరని అప్పట్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉందని ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ కి ఉండటంతో పాటు ఎన్టీఆర్ కి ఉన్న అశేష ప్రజాదరణ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిందని. కానీ పవన్ కళ్యాణ్ కు అటువంటి పరిస్థితులు ఏమీ ఇప్పుడు లేవని , పార్టీ పెట్టినప్పుడు ఉన్న జోష్ ప్రస్తుతం జనసేనకు లేకపోవడం, క్రమక్రమంగా పవన్ పై ప్రజలకు నమ్మకం తగ్గిపోవడం.

పూటకో మాట మాట్లాడటం పవన్ పై ఉన్న క్రేజ్ ని తగ్గించిందని అంటున్నారు..

అయితే పవన్ ఈ సభ నుంచీ ప్రకటించబోయే అభ్యర్ధుల జాబితా కేవలం కొంతమంది పేర్లతో ఉందని. పూర్తి స్థాయిలో ఇంకా అభ్యర్ధులు ఖరారు కాలేదనే టాక్ వినిపిస్తోంది.

మరి పవన్ ఏపీలో అన్ని స్థానాలలో పోటీ చేస్తారా.?? లేక కొన్ని స్థానాలకే పరిమితం అవుతారా అనేది పార్టీ ఆవిర్భావ సభ లో తేలిపోతుంది అంటునారు విశ్లేషకులు.