బ్రేకింగ్ - జనసేన అభ్యర్ధుల మొదటి జాబితా.. విడుదల...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తమ పార్టీ నుంచీ పోటీ చేయనున్న లోక్ సభ, శాసనసభ అభ్యర్ధుల మొదటి జాబితాని విడుదల చేశారు.రెండు రోజుల క్రితం విడుదలైన మొదటి జాబితా ఇదే అంటూ వచ్చిన పేర్లకి తమకి ఎంటువంటి సంభంధం లేదనేట్టుగా ఉంది ఈ జాబితా.

 Janasena Party Candidates First List For 2019 Elections1-TeluguStop.com

అయితే ఏపీలో మొత్తం 175 స్థానాలకి గాను కేవలం 32 స్థానాలకే అభ్యర్ధులని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మిగిలిన 143 స్థానాలలో కమ్యునిస్టులకు స్థానాలు కేటాయించిన తరువాత తుది జాబితా విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

ఇదిలాఉంటే అభ్యర్ధుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ వేసి దాదాపు 1200 వందల దరఖాస్తులు వచ్చాయని చెప్పగా ఇప్పుడు మొదటి జాబితా నుంచీ పవన్ కళ్యాణ్ ఈ స్క్రీనింగ్ కమిటీ ద్వారా వచ్చిన 1200 మందిలో 8 మంది కొత్త వారికి అవకాశం కలిపించినట్టుగా జనసేన పార్టీ తెలిపింది.

తుది జాబితాలో సైతం కొత్తవారికి అవకాశం కల్పించానున్నారట పవన్ కళ్యాణ్.మరి ఇప్పటికే పవన్ ప్రకటించిన ఈ స్థానాలలో ఉన్న అసమ్మతులని పవన్ ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాల్సిందే.

లోక్ సభ అభ్యర్ధులు:

1.అమ‌లాపురం- శ్రీ డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌

2.రాజ‌మండ్రి- డాక్ట‌ర్ శ్రీ ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌

3.విశాఖ‌ప‌ట్నం- శ్రీ గేదెల శ్రీనుబాబు

4.అన‌కాప‌ల్లి- శ్రీ చింత‌ల పార్థసారధి

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు:

1.య‌ల‌మంచిలి- శ్రీ సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌

2.పాయ‌క‌రావుపేట- శ్రీ న‌క్కా రాజ‌బాబు

3.పాడేరు – శ్రీ ప‌సుపులేటి బాల‌రాజు

4.రాజాం- డాక్ట‌ర్ ముచ్చా శ్రీనివాస‌రావు

5.శ్రీకాకుళం- శ్రీ కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు

6.ప‌లాస‌- శ్రీ కోత పూర్ణ‌చంద్ర‌రావు

7.ఎచ్చెర్ల‌- శ్రీ బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)

8.నెల్లిమ‌ర్ల‌- శ్రీమ‌తి లోకం నాగ‌మాధ‌వి

9.తుని- శ్రీ రాజా అశోక్‌బాబు

10.రాజ‌మండ్రి రూరల్- శ్రీ కందుల దుర్గేష్‌

11.రాజోలు- శ్రీ రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌

12.పి.గ‌న్న‌వ‌రం- శ్రీమ‌తి పాముల రాజేశ్వ‌రి

13.కాకినాడ సిటీ- శ్రీ ముత్తా శ‌శిధ‌ర్‌

14.అన‌ప‌ర్తి- శ్రీ రేలంగి నాగేశ్వ‌ర‌రావు

15.ముమ్మిడివ‌రం- శ్రీ పితాని బాల‌కృష్ణ‌

16.మండ‌పేట‌- శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ‌

17.తాడేప‌ల్లిగూడెం- శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్‌

18.ఉంగుటూరు- శ్రీ న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌

19.ఏలూరు- శ్రీ రెడ్డి అప్ప‌ల‌నాయుడు

20.తెనాలి- శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్‌

21.గుంటూరు వెస్ట్‌ – శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్‌

22.ప‌త్తిపాడు- శ్రీ రావెల కిషోర్‌బాబు

23.వేమూరు- డాక్ట‌ర్ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌

24.న‌ర‌స‌రావుపేట‌- శ్రీ స‌య్య‌ద్‌ జిలానీ

25.కావ‌లి- శ్రీ ప‌సుపులేటి సుధాక‌ర్‌

26.నెల్లూరు రూర‌ల్‌- శ్రీ చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి

27.ఆదోని- శ్రీ మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)

28.ధ‌ర్మ‌వ‌రం- శ్రీ మ‌ధుసూద‌న్‌రెడ్డి

29.రాజంపేట‌- శ్రీ ప‌త్తిపాటి కుసుమ‌కుమారి

30.రైల్వే కోడూరు- డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌

31.పుంగ‌నూరు- శ్రీ బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్

32.మ‌చిలీప‌ట్నం- శ్రీ బండి రామ‌కృష్ణ‌

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube