జనసేన వేదిక అయ్యేది కొత్త తరానికా... పాత కాపులకా!  

న్యూ జెనరేషన్ కి పొలిటికల్ ప్లాట్ ఫాం అవుతున్న జనసేన. .

Janasena Party Become A Political Platform To New Generation-

ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగే ప్రయత్నం చేసిన జనసేన పార్టీకి ఏపీలో ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది.అయితే ప్రజాతీర్పుని గౌరవించి పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకి వెళ్తున్నాడు.

Janasena Party Become A Political Platform To New Generation--Janasena Party Become A Political Platform To New Generation-

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలని ద్రుష్టిలో ఉంచుకొని కొత్తగా కమిటీలు కూడా ఏర్పాటు చేసాడు.ఇక స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు దేశం పార్టీ హవా ఏపీలో మసకబారుతుంది.ఈ నేపధ్యంలో ఏపీలో వైసీపీకి పోటీగా ఉన్న పొలిటికల్ స్పేస్ ని తీసుకునే అవకాశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వచ్చింది.

ఇక ఏపీలో ఈ పొలిటికల్ స్పేస్ ని ఉపయోగించుకొని బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది.

దాని కోసం ఆ పార్టీ అధినాయకత్వం తెలుగు దేశం పార్టీలో ఉన్న నేథలకి గాలం వేస్తుంది.ఇప్పటికే కొందరిని తన వైపుకి లాక్కుంది.వారి బలంతో రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంది.ఇక తెలుగు దేశం పార్టీకి భవిష్యత్తు ఉండదని భావిస్తున్న పాత కాపులు అందరూ బీజేపీలోకి వచ్చేస్తున్నారు.

వారిలో అందరూ రాజకీయాల వృద్ధులే.

వారితో భవిష్యత్తుని బాటలు వేసుకోవడం అంటే కచ్చితంగా ఉపయోగం లేని ప్రయత్నం అవుతుంది.ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరకి కూడా టీడీపీ పాత కాపులు అందరూ రావడానికి సిద్ధం అవుతున్నారు.అయితే ప్రస్తుతానికి వారికి పవన్ బ్రేక్స్ వేసారు.భవిషత్తులో ఏపీలో బలమైన శక్తిగా ఎదగాలంటే కొత్త తరం నాయకులని, ముఖ్యంగా యువ నాయకులని తయారు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

మరి పాత కాపులని ఎదుర్కొనే విధంగా యువ నాయకత్వంని ఈ ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ ఏ మేరకు తయారు చేస్తాడు అనేది ఇప్పుడు ఆస్కతికరంగా మారింది.