జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.ఏ వ్యూహం లేకుండా రాజకీయాలను శాసిద్దాం అని ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి.
ఏపీలో జనసేన పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో తెలంగాణలో ఆయన ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని, అనుమానాలను కలిగిస్తోంది.అది కూడా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలి అనుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది.
కనీసం ఏపీలో పదుల సంఖ్యలో కూడా దక్కించుకోలేక చతికిల పడ్డ జనసేన, ఏ బలం లేని తెలంగాణ లో ఎలా బలం పుంజుకుంటుందని భావిస్తున్నారో ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది.
అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ కు విజయం దక్కకుండా , జనసేన ద్వారా ఓట్లను చీల్చేందుకు జనసేన ఈ విధంగా వాడుకుంటుంది అనే అనుమానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి.
అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన కూడా రాజకీయ గందరగోళం తావిస్తోంది.కేవలం నాయకులు, కార్యకర్తల కోరిక మేరకే , వారి ఆశయాల మేరకే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని,ప్రకటించారు.
కానీ మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నరా ? అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాము వంటి ఏ విషయాలను ప్రకటించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.పోలింగ్ తేదీ విడుదలైన తర్వాత ప్రచారానికి పెద్దగా సమయం లేని సమయంలో , పవన్ ఈ విధమైన ప్రకటన చేయడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం ఏపీలో జనసేన బిజెపి పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకి వెళ్తున్నాయి.కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ సమయంలో పవన్ బిజెపికి వ్యతిరేకంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీకి దిగే చాన్స్ కనిపించడం లేదు కానీ అధికార పార్టీ టిఆర్ఎస్ కు వెళ్లే ఓట్లను చీల్చేందుకు ఈ విధంగా బీజేపీతో కలిసి కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు అప్పుడే టిఆర్ఎస్ నుంచి మొదలైంది.ఏది ఏమైనా పవన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా జనసేన కు ఇబ్బందులు తెచ్చిపెట్టేది అనడంలో ఎటువంటి సందేహం లేదు.