తెలంగాణ: జనసేనలో మరిన్ని పదవుల ప్రకటన  

తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికలు కూడా అతి సమీపానికి రావడంతో కొత్తగా కొన్ని నియామకాలను చేపట్టాడు. ఇప్పటికే కొన్ని నియామకాలను పూర్తి చేయగా… ఇప్పుడు మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు పార్లమెంటరీ కమిటీలను నియమించారు. మెదక్, నల్లగొండ, భువనగిరి, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను ప్రకటించారు.

Janasena Parlament Commities Announced In Telangana-

Janasena Parlament Commities Announced In Telangana

ఇప్పటికే సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఖమ్మం లోక్‌‌సభ నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో కమిటీలో 11 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, 32 మంది వర్కింగ్ కమిటీ సభ్యులను నియమించారు పవన్