స్థానిక పోరులో బీసీల రిజర్వేషన్ పై ప్రభుత్వం మెలిక! సుప్రీంకి వెళ్తాం అంటున్న విపక్షాలు

స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్ధుల రిజర్వేషన్ ప్రాతిపాదికగా సీట్ల కేటాయింపులో 59 శాతం నుంచి 50 శాతం కి మించరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.రిజర్వేషన్ల శాతం 50కే పరిమితం చేసిన అందులో బీసీ రిజర్వేషన్ శాతం 34 నుంచి 24కి తగ్గించింది.

 Janasena Oppose To Reduce The Bc Reservation In Local Body Elections-TeluguStop.com

దీంతో ఈ స్థానిక ఎన్నికలలో పోటీ చేయబోయే బీసీ అభ్యర్ధుల జాబితా తగ్గిపోయే అవకాశం ఉంది.ఇక బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వైసీపీ తమకి అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ విధంగా పాచిక వేసిందని భావిస్తున్న విపక్షాలు దీనిపై ఒక్కసారిగా బాగ్గుమన్నాయి.

అటు టీడీపీ, మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన, బీజేపీ కూటమి బీసీ ఓటు బ్యాంకుని నమ్ముకుంది.అయితే బీసీ రిజర్వేషన్ లో కొత్త విధించడం వలన వారికి అభ్యర్ధులు ఎంపిక ఇబ్బంది అవుతుంది.

దీనిని వైసీపీ అనుకూలంగా మార్చుకుంది.

బీసీ రిజర్వేషన్లని తగ్గించడంపై ఇప్పటి వరకు టీడీపీ పార్టీ నేతలు పెద్దగా స్పందించలేదు.

ఎన్నికలు ఎప్పుడు జరిగిన తాము సిద్ధమని, వైసీపీ వ్యతిరేకత తమకి కలిసి వస్తుందని భావిస్తుంది.అయితే జనసేనతో పాటు, వామపక్షాలు ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

బీసీ రిజర్వేషన్లు తగ్గించడంలోపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తామని ఆ రెండు పార్టీలకి చెందిన నేతలు ప్రకటించారు.ఒక వేళ అదే జరిగితే మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరి జనసేన పార్టీ నేతలు, వామపక్షాలు తీసుకున్న నిర్ణయం ప్రకారం సుప్రీంకి వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే సైలెంట్ అయిపోతారా అనేది ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube