ఎగ్జిట్ పోల్స్ ని అస్సలు పరిగణంలోకి తీసుకొని జనసేన! క్యాడర్ ఆలోచన ఎలా ఉందంటే  

ఎగ్జిట్ పోల్స్ ని అస్సలు పరిగణంలోకి తీసుకొని జనసేన. .

Janasena Not Concentrate On Exit Polls-janasena Not Concentrate,tdp,ysrcp

మరో ఐదు రోజులలో ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడనున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా కూడా లోక్ సభ ఎన్నికలు ఫలితాలు రానున్నాయి. అయితే ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేసాయి..

ఎగ్జిట్ పోల్స్ ని అస్సలు పరిగణంలోకి తీసుకొని జనసేన! క్యాడర్ ఆలోచన ఎలా ఉందంటే-Janasena Not Concentrate On Exit Polls

ఇక చాలా వరకు సర్వే సంస్థలు తమ ఫలితాలలో ఎన్డీఏ కూటమి గెలిచి మళ్ళీ మోడీ ప్రధాని అవుతాడని స్పష్టం చేసేసాయి. ఇక ఏపీలో ఈ సారి వైసీపీ అధికారంలోకి వస్తాయని తెలియజేసాయి. అయితే ఈ ఫలితాల సరళి చూస్తుంటే ఏపీలో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీని మాత్రమే జాతీయ చానల్స్ పరిగణలోకి తీసుకోవడం విశేషం.

ఇదిలా ఉంటే మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండదనే విధంగా మీడియా సంస్థలు సర్వేలు ఉన్నాయి. ఇక ఈ సర్వేలు విడుదల అయిన తర్వాత ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగు దేశం పార్టీ జబ్బలు చరుచుకొని మీడియా ముందుకొచ్చి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటే జనసేన అధినేత మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ తో తనకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లు ఉండటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి స్పందిస్తాడు అని అందరూ భావించిన అసలు జనసేన పార్టీ నుంచి ఎగ్జిట్ పోల్స్ పై ఒక్క లక్ష్మినారాయణ తప్ప ఎవ్వరు మీడియా ముందుకి రాలేదు.

రాబోయే ఫలితాలు ఎలాగు వస్తాయి కాబట్టి ఇక ఊహాజనితమైన ఎగ్జిట్ పోల్స్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడాల్సిన పని లేదు అన్నట్లు పవన్ కళ్యాణ్ వ్యవహరించడం. జనసేన క్యాడర్ కి మరింత ఉత్సాహం పెంచుతుంది అని చెప్పాలి. వారి ఉత్సాహం ఎలా ఉందో అనేది సోషల్ మీడియాలో జనసేన పేజీలలో వారి కామెంట్స్ చూస్తూ ఉంటే తెలుస్తుంది.