ఈ గజిబిజి పాలిటిక్స్ జనసేనకు అర్ధం కావడంలేదా ?  

 • పాలిటిక్స్ అంటేనే గజిబిజి గందరగోళం ! రకరకాల మనుషులు రకరకాల ఎత్తుగడలు, వెన్నుపోట్లు, అలకలు ఇవన్నీ నిత్యం చూడాల్సిన అంశాలే. రాజకీయాలంటే పైకి కనిపిస్తున్నంత ఈజీగా అయితే ఉండవు.

 • ఈ గజిబిజి పాలిటిక్స్ జనసేనకు అర్ధం కావడంలేదా ? -Janasena Not Able To Understand These Politics

 • జనం నాడి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరికీ అంతుపట్టదు. ఈ విషయం ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి కూడా బాగా తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది.

 • అందుకే ఎన్నికల అనంతరం ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియక సతమతం అవుతోంది. ఏపీలో పోలింగ్ ప్రక్రియ మిగిసినప్పటి నుంచి వైసీపీ, టీడీపీ కూడా ఎన్నికల సందర్భంగా తలెత్తిన లోటుపాట్లను గురించి పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాయి.

 • టీడీపీ అయితే ఇప్పటికే ఈ విషయమై కొంచెం గందరగోళంలో ఉంది. ఒక పక్క ఈవీఎం లలో లోపాలు ఉన్నాయని, ఈవీఎం మిషన్స్ రద్దు చేయాలంటూ హడావుడి చేస్తూనే మరోపక్క తమ పార్టీకి మెజార్టీ స్థానాలు రాబోతున్నాయని చెప్తూ హడావుడి చేస్తోంది.

 • ఇక వైసీపీ అయితే తమ పార్టీకి అధికారం దక్కడం ఖాయం అయిపొయింది అంటూనే అప్పుడే ఎవరెవరికి ఏ ఏ శాఖలు ఇవ్వాలనే విషయం పై ఆలోచన చేస్తోంది. ఈ విషయంలో కాస్త లేటుగా స్పందించిన జనసేనాని మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు.

 • Janasena Not Able To Understand These Politics-Evm Janasena Pawan Kalyan Political Updates Polling Tdp గజిబిజి పాలిటిక్స్

  ఈ సమావేశాల తరువాత జనసేన వాయిస్ లో కొంచెం మార్పు కనిపిస్తోంది. మేం కోరుకున్న మార్పు మొదలైంది అంటూ ప్రకటిస్తూనే, మాకు ఏపీలో రాబోయే సీట్ల గురించి బెంగ లేదు అంటూ చెబుతున్నారు. అంతే కాదు, సర్వేల ఫలితాలతో తమకు సంబంధమే లేదని తెగేసి చెబుతున్నారు.

 • మొదటి నుంచీ జనసేన పార్టీలో చాలా విషయాలపై స్పష్టతలేదు. పోలింగ్ తేదీ ముగిసిన నాటినుంచి జనసేన లో యాక్టివ్ నెస్ బాగా తగ్గిపోయింది.

 • ఇది గ్రహించిన పవన్ ఎన్నికల ఫలితాల సంగతి పక్కనపెట్టి జనం తరుపున నిలబడాలి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఏపీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదనీ అప్పుడు తామే కింగ్ మేకర్ అవుతామని భావిస్తున్న తరుణంలో జనసేన ప్రభావం ఏపీలో అంతగా ఉండదనే సర్వే రిపోర్ట్స్ పవన్ కి అందడంతో ఢీలా పడినట్టు తెలుస్తోంది.