ఆ ఒక్కడూ వైసీపీలోకి జంప్ చేస్తాడా ?  

Janasena New Mla Rapaka Varaprasad Rao Join In Ysrcp Party-pawan Kalyan,rapaka Varaprasad Rao,razole,ysrcp,రాపాక వరప్రసాద్,వైసీపీ

రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తామంటూ ఎన్నికల్లో పోటీకి వెళ్లి చతికిలపడ్డ జనసేన పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటు దక్కించుకుంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ అనే అభ్యర్థి మాత్రమే విజయం సాధించగా, పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓటమి చవిచూశాడు. జనసేన వెనుకబడ్డానికి కారణం పార్టీలో సమన్వయ లోపం, పవన్ తప్ప ఆ పార్టీని బుజాల మీద వేసుకుని నడిపించే అంత స్థాయి నాయకులు మరెవరూ కనిపించకపోవడం, పోల్ మేనేజ్మెంట్ తెలియకపోవడం ఇవన్నీ జనసేన కు మైనస్ గా మారాయి..

ఆ ఒక్కడూ వైసీపీలోకి జంప్ చేస్తాడా ? -Janasena New Mla Rapaka Varaprasad Rao Join In Ysrcp Party

సీపీఐ, సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా జనసేనకు ఫలితం దక్కలేదు.

మరోవైపు చూస్తే వైసీపీ 151 సీట్లతో తిరుగులేని మెజార్టీ సాధించడంతో పాటు, టీడీపీ 23 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు జనసేన నుంచి గెలిచినా రాపాక వరప్రసాద్ మీద అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జనసేనలో ఉండడం కంటే అధికార పార్టీగా మారబోతున్న వైసీపీలోకి వెళ్లడం వల్ల నియోజకవర్గ అభివృద్ధితో పాటు, తనకు కూడా అన్నిరకాలుగా మంచి అవకాశాలు ఉంటాయని ఆయన భావిస్తున్నట్టు అప్పుడే ప్రచారం మొదలయ్యింది.

అయితే వైసీపీ మాత్రం ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ కి రాలేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో వైసీపీలో గెలిచిన కొంతమంది ఎమ్యెల్యేలను టీడీపీ లో చేర్చుకోవడమే కాకుండా వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దీనిపై వైసీపీ అనేక విమర్శలు చేయడంతో పాటు, పెద్దఎత్తున పోరాటం కూడా చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు వైసీపీలో చేరదామన్నా జగన్ అందుకు ఒకే చెప్తాడా లేక వారికి నో ఎంట్రీ బోర్డు తగిలిస్తాడా అనేది చూడాలి.