పార్టీ కి దూరంగా లేను,అలానే దగ్గరగా కూడా లేను అంటున్న ఒకే ఒక్కడు

అసెంబ్లీ లో జనసేనపార్టీ నుంచి ఎన్నికైన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక.ఇటీవల ఆయన పార్టీ తో పెద్దగా సంబంధాలు నెరపడం లేదు అంటూ వార్తలు కూడా వచ్చాయి.

 Janasena Mla Rapaka Sensational Comments About His Presence In Party-TeluguStop.com

అయితే ఆయన తాజాగా గురువారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన రాపాక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికి కూడా మూడు రాజధానులు కట్టుబడి ఉన్నానని, విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా తీసుకువస్తే దాని వలన ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆ విషయానికి తాను కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.

అలానే పార్టీకి దూరంగా ఉంటున్నారు అంటూ వచ్చిన వార్తలపై కూడా రాపాక క్లారిటీ ఇచ్చారు.జనసేన పార్టీతోనే ఇప్పటికీ ఉన్నానని, దగ్గరగా ఉన్నానా లేదా అన్నది ముఖ్యం కాదని అన్నారు.

అయితే ఒకపక్క పార్టీకి దూరంగా లేనని చెప్పిన ఆయన దగ్గరగా కూడా లేనన్నట్లు చెప్పడం తో సందిగ్ధంలో పడేశారు.

మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉన్నట్టుగా గతంలో అసెంబ్లీలో చెప్పిన నేపథ్యంలో… జనసేన పార్టీ స్టాండ్‌ కు వ్యతిరేకంగా రాపాక అసెంబ్లీలో మాట్లాడటంతో పార్టీ వర్గాలు పెదవి విరిచాయి.

మూడు రాజధానులు రాబోతున్నాయని, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా రాబోతున్నట్టు జగన్‌ ప్రకటించిన తరువాత ఆయన జగన్‌ కు పాలాభిషేకం కూడా చేశారు.అయితే అప్పుడే ఆయన పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కూడా.

ఒకరకంగా ఆయన అప్పటి నుంచి పార్టీ కి కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube