పవన్ కళ్యాణ్ కి ఆ నేత షాక్ ఇస్తారా...???

ఏపీలో సీఎం పీఠం దక్కేది ఎవరికో తెలియడానికి ఇంకా నెలరోజుల సమయం ఉంది.ఇప్పటికే పలు సర్వేలు సైతం జగన్ సీఎం అవ్వడం పక్కా అని తేల్చేశాయి.

 Janasena Member To Join Ycp-TeluguStop.com

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కూర్చోవడం ఖాయమని తేలడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు మారిపోయాయి.ఇక జనసేన పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది.కింగ్ మేకర్ ఏమో గానీ పార్టీలో నేతలు ఎవరెవరు ఎన్నికల రిజల్స్ వరకూ ఉంటారో అనే సందేహాలు కలుగుతున్నాయి

తాజాగా రాజకీయవర్గాలలో, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వస్తున్నాయి.అదేంటంటే…జనసేన పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న ఓ నేత త్వరలో వైసీపీలో చేరుతున్నారు అంటూ వస్తున్న ఈ వార్తలు జనసేన పార్టీలో గుబులు రేపుతున్నాయి.సదరు నేత గతంలో వైసీపీ నుంచీ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారని, మళ్ళీ ఈ సారి వైసీపీ నుంచీ టిక్కెట్టు రాదనీ జనసేనలో చేరి పార్టీలో క్రియాశీలక వ్యక్తిగా ఉన్నారని తెలుస్తోంది

ఓటింగ్ సరళిని గమనించిన ఆయన తనకి అందిన రిపోర్ట్ ఆధారంగానే జనసేనకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలో త్వరలో చేరనున్నారని టాక్ వినిపిస్తోంది.అందులో భాగంగానే సదరు నేత పార్టీలో కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండటం మొదలు పెట్టారని.

దాంతో ఆయన వైసీపీలోకి వెళ్లడం ఖాయమనే విషయాన్ని జనసేనలో కొదంరు నేతలు కూడా చర్చించుకుంటున్నారట.ఇదిలాఉంటే తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని బట్టి చూస్తే

తెలుగు దేశం పార్టీ ,జనసేన ల నుంచీ కూడా పెద్ద ఎత్తున నేతలు వైసీపీలోకి వెళ్ళే ఆవకాశం ఉందని అయితే ఎన్నికల రిజల్స్ వచ్చిన తరువాత వెళ్ళాలా లేదా ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే వెళ్ళాలా అనే ఆలోచనలో ఉన్నారట.

ఈ మేరకు వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి తో సదరు నేతలు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలు ఏ మేరకు వాస్తవం అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube