బిజెపితో పొత్తు ఉన్నా, ఏపీలో రాజకీయంగా జనసేన సత్తా చాటేందుకు , ఒంటరిగానే ఇప్పుడు రాజకీయ పోరాటాలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నారు.ఈరోజు కృష్ణా జిల్లాలో పవన్ పర్యటించి వారు తుఫాను కారణంగా, పంటలు దెబ్బతిని విలవిల్లాడుతున్న రైతులను ఓదార్చేందుకు పవన్ ముందుకు కదిలారు.
రైతులను ఓదార్చారు.ప్రభుత్వం పంట నష్టం ఇచ్చేవరకు పోరాడుతానని పవన్ ప్రకటించారు.తనకు జనాలు ఓట్లేసి గెలిపించకపోయినా, నేను జనం కోసమే పని చేస్తాను అంటూ పవన్ ఈ సందర్భంగా ప్రకటించారు.

ఇక ఆయన అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.మరో మూడు రోజుల పాటు రైతులకు అండగా నిలబడు తూ భరోసా యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక పవన్ పర్యటన తో జనసైనికులలో ఉత్సాహం కనిపిస్తోంది.
ఇప్పటి వరకు పవన్ హైదరాబాద్ కే పరిమితం అయి పోయారని , ఏపీలో పార్టీని గాలికి వదిలేశారని ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పవన్ రాజకీయాలలో సక్సెస్ అవ్వలేరు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.ఇప్పటి వరకు పవన్ సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ విమర్శలను తట్టుకుంటూ వచ్చారు.
ఇప్పుడు రైతు సమస్యలపై పోరాడేందుకు ముందుకు కదలడం రాజకీయం గా చర్చనీయాంశం అవుతోంది.
ముందుగా బిజెపితో కలిసి ఈ తరహా యాత్రలు, ఆందోళనలు చేపట్టాలని పవన్ భావించినా, ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించకపోవడం, తెలంగాణ లో చోటుచేసుకున్న పరిణామాలు అన్నిటి తొనూ పవన్ కాస్త విసుగు చెందినట్లుగా తెలుస్తోంది.
అందుకే ఒంటరిగానే ఈ తరహా ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ ఈ సందర్భంగా తమ రాజకీయ ప్రత్యర్థులపై పవన్ సెటైర్లు వేశారు.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుగా జనసేన తలుపు తడుతున్నారు అంటూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ సెటైర్ లు వేశారు.
కృష్ణ జిల్లా ఉయ్యూరు, పామర్రు చల్లపల్లి అవనిగడ్డ లో పవన్ యాత్ర నిర్వహించారు.
పవన్ టూర్ సక్సెస్ కావడంతో బీజేపీ శ్రేణులు సైతం ఈ వ్యవహారాలపై విశ్లేషణలు చేసుకుంటున్నాయి.ఒంటరిగా ఈ విధంగా యాత్రలు చేపట్టడం ద్వారా తమకు కలిసి వస్తుందా లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాలా అనే విషయంపై లోతుగా అధ్యయనం చేసుకుంటున్నట్టు సమాచారం.