ఆ బంధం పై జనసైనికుల్లో సందేహాలెన్నో ?

జనసేన పార్టీ ఏపీ లో కాస్త ఇబ్బందికర పరిణామాలు ను రాజకీయంగా ఎదుర్కొంటున్నా, ఆ పార్టీని తమ భుజ స్కంధాల పై మోస్తూ,  గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, పార్టీ కోసం అహర్నిశలు పని చేసే వారు ఎంతో మంది జనసేన లో ఉన్నారు.కేవలం పవన్ పై ఉన్న అభిమానం తో జనసేన ను ఎప్పటికైనా అధికారంలోకి తీసుకురావాలనే ధ్యేయంతో కులాలకు అతీతంగా , చాలా మంది యువత ఆ పార్టీకి అండగా నిలబడుతున్నారు.

 Janasena Leaders Angry On Bjp Behaviour, Janasena Leaders, Bjp, Tirupathi By Ele-TeluguStop.com

పవన్ ఆదేశించినా, ఆదేశించక పోయినా, పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకు వెళ్తూ, వివిధ సేవా కార్యక్రమాల పేరుతో జనాల్లో జనసేన పేరు నిరంతరం వినిపించే విధంగా చేయడంలో వారు నిరంతరం కష్టపడుతున్నారు.
2019 ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకుంటూనే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా తమ వంతు ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు.

ఇదిలా ఉంటే 2024 ఎన్నికల పైన పవన్ ప్రస్తుతం గురి పెట్టారు.ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన ను అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.

అయితే ఇదే సమయంలో బిజెపి వ్యవహరిస్తున్న తీరు జన సైనికులకు సైతం మింగుడు పడని అంశంగా మారింది.బీజేపీతో కలిసి ముందుకు వెళ్లడం ద్వారా అనవసరంగా జనసేన బలం తగ్గించుకోవాల్సి వస్తుందని, ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలితో జనసేన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల వ్యవహారంలో జనసేన ను అవమానించే విధంగా బిజెపి వ్యవహరిస్తోందని స్వయంగా తమ నాయకుడు పవన్ కలిసిన కమిటీ పేరుతో నాంచి వేత ధోరణి అవలంబిస్తే , చివరికి బిజెపి అభ్యర్థిని బరిలోకి దింపే విధంగా బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారని వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

Telugu Delhi, Janasena, Pawan Kalyan, Tirupathi-Telugu Political News

అలాగే బీజేపీ పెద్దలు పవన్ కు అపాయింట్మెంట్ ఆలస్యం చేసి అవమానించారని జనసైనికులు రగిలిపోతున్నారు. అసలు ఏపీలో జనసేన తో పోల్చుకుంటే బీజేపీ బలం తక్కువ అని, 2019 ఎన్నికలలో రాష్ట్రంలో జనసేన ఆరు శాతం ఓట్లు సాధించింది అని, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో రెండో స్థానంలో నిలిచింది అనే విషయాన్ని జనసేన అభిమానులు గుర్తు చేస్తున్నారు.కనీసం జనసేన పార్టీ ఒక్క స్థానమైన గెలుచుకుంది అని, కానీ జాతీయ పార్టీగా ఉన్న బిజెపి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటును కూడా గెలుచుకో లేకపోయిందని , కనీసం రెండు, మూడు స్థానాల్లో కూడా ఆ పార్టీ నిలవలేక పోయిందని,  ఇప్పుడు గుర్తు చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.

దుబ్బాక లో విజయం సాధించినంత మాత్రాన తిరుపతిలోనూ బిజెపి ఆ స్థాయిలో విజయం కోసం పాాటు పడుతోందని, అక్కడ బిజెపి కంటే జనసేన బలం ఎక్కువగా ఉందని, ఖచ్చితంగా ఆ సీటును జనసేనకు కేటాయించాలని , లేకపోతే బీజేపీతో పొత్తు ను రద్దు చేసుకుంటేనే మంచిదని వారు అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం ఒక్క సీటు విషయంలోనే బీజేపీ ఇంత పట్టుబడుతుంటే , రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో బిజెపి మరింత ఇబ్బంది పెడుతుంది అనే విషయాన్ని జనసైనికులు గుర్తుచేస్తూ , ఈ వ్యవహారంపై అధిష్టానంపై ఒత్తిడి పెంచాల నే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube