నాదెండ్లతో పవన్ కు ఇబ్బందేనా ?  

Janasena Leader Nadendla Manohar Daminate The Pawan Kalyan - Telugu Janasena, Janasena Pawan Kalyan, Nadendla Manohar, Nadendla Manohar And Janasena, Pawan Kalyan, Pawan Kalyan Busy With Movies

జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ టూ స్థానంలో ఉన్నది నాదెండ్ల మనోహర్.జనసేన పీఎసీ చైర్మన్ గా కూడా నాదెండ్ల ఉన్నారు.

 Janasena Leader Nadendla Manohar Daminate The Pawan Kalyan

పవన్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండడంతో పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు.జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తాను పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతానని పవన్ చెప్పినా ఇప్పుడు ఆ మాట తప్పి సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

దీంతో ఇప్పుడు ఆ పార్టీ వ్యవహారాలన్నీ నాదెండ్ల ఒక్కరే చూస్తున్నారు.ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఆయన పర్యటిస్తూ జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

నాదెండ్లతో పవన్ కు ఇబ్బందేనా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వాస్తవంగా చెప్పకుంటే జనసేన లో పవన్ యాక్టివ్ రోల్ పోషిస్తున్న సమయంలోనూ నాదెండ్ల తన హావా చూపించేందుకు ప్రయత్నించేవారు.ఆ పెత్తనం మరీ మితిమీరడంతో చాలామంది నాయకులు ఇబ్బందులు పడ్డారు.

అటువంటి అవమానాలు భరించలేకే జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరమయ్యారు.ఇప్పుడు పవన్ కూడా జనసేన మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో నాదెండ్ల పెత్తనం కాస్త ఎక్కువ అయినట్లుగా చర్చ జరుగుతోంది.

నాదెండ్ల ఉత్తరాంధ్ర, మరెక్కడ పర్యటన చేపట్టినా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగాలు చేస్తూ, అనేక సూచనలు ఇస్తున్నారు.అయితే అధినేత పవన్ అభిప్రాయం ఇది అని ఎక్కడా పవన్ పేరు ప్రస్తావించకుండానే అవన్నీ తానొక్కడినే ఆదేశిస్తున్నాట్టుగా నాదెండ్ల వ్యవహరిస్తుండడంతో పవన్ ను నాదెండ్ల లెక్క చేయడం లేదంటూ ఆ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి.

అయితే పూర్తిగా జనసేన ఆక్రమించుకోవాలని నాదెండ్లకు లేకపోయినా, పార్టీలో అన్నీ తానే పెత్తనం చేయాలని బలమైన కోరిక మాత్రం ఉన్నట్టుగా కనిపిస్తోంది.దానికి అనుగుణంగానే ఇప్పుడు పార్టీలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ వ్యవహారంతో జనసేన పార్టీలో నాదెండ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.పవన్ కూడా నాదెండ్ల వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచినా ఆయనపై ఎటువంటి అనుమానాలు అయితే ప్రస్తుతానికి వ్యక్తం చేయడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Janasena Leader Nadendla Manohar Daminate The Pawan Kalyan Related Telugu News,Photos/Pics,Images..

footer-test