ఒక వైపు స్టీల్ ప్లాంట్.. మరో వైపు డ్రగ్స్ ! పవన్ ఫిక్స్ అయిపోయారు 

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, రాజకీయంగా స్పీడ్ పెంచి నిర్ణయాలు తీసుకోకపోతే, జనసేన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు, పార్టీని పూర్తిగా మూసెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఎక్కువయినట్టుగా కనిపిస్తోంది.అందుకే ఆయన యాక్టీవ్ గా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వం పై అదేపనిగా విమర్శలు చేస్తూ, జనసేన ను బలోపేతం చేసే విషయం పై దృష్టి పెట్టారు.

 Janasena Is Going To Make A Movement On Drugs In Ap-TeluguStop.com

అనేక పార్టీ కమిటీల నియామకం పూర్తి చేశారు.తమతో పొత్తు పెట్టుకున్న బిజెపి విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకునేందుకు పవన్ సిద్దమయ్యారు.

దీనిలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై ఆయన స్పందించారు.ఈ నెల 31వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలపడం తో పాటు, జనసేన తరపున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం పై పోరాటం చేసేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు.

 Janasena Is Going To Make A Movement On Drugs In Ap-ఒక వైపు స్టీల్ ప్లాంట్.. మరో వైపు డ్రగ్స్ పవన్ ఫిక్స్ అయిపోయారు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో పాటు ఏపీలో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ వ్యవహారం పైన జనసేన తరఫున పోరాటం చేయాలనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లు సమాచారం.ఈ  మేరకు పవన్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన సంకేతాలు పంపించారు .దేశంలోనే గంజాయికి ఏపీ ప్రధాన కేంద్రంగా మారిందని పవన్ ట్వీట్ చేశారు.అసలు ఈ సమస్యను తాను ఎప్పుడో గుర్తించాను అని, గతంలో తాను ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్ లో పర్యటించినప్పుడే గుర్తించాను అని పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన వీడియోను ఆయన జత చేశారు.ఏపీ నుంచి గంజాయి దేశమంతా సరఫరా అవుతోందని నల్గొండ ఎస్పీ చేసిన వ్యాఖ్యలను పవన్ ట్విట్ చేసారు. ఏపీ డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని పవన్ విమర్శలు చేశారు
.ఇది దేశం పై తీవ్ర ప్రభావం చూపుతోందని ,ఈ సమస్యను ప్రభుత్వ  పెద్దలు దాచిపెడుతున్నారు అంటూ విమర్శలు చేశారు.

Telugu Ap, Ap Cm, Bjp, Bjp Janasena Aliance, Chandrababu, Janasen Drugs Moment, Janasena, Janasenani, Vizag Steel Plant-Telugu Political News

మొన్నటి వరకు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం ను విమర్శిస్తూ వచ్చింది.వీటి కారణంగానే ప్రభుత్వం అసహనంతో తమ పార్టీ ఆఫీస్లపై దాడులకు దిగడం తో పాటు, తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయించారు అనే ఆరోపణలు చేస్తోంది.సరిగ్గా ఇదే సమయంలో పవన్ సైతం ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారంపై దృష్టిపెట్టడంతో ,ఇది మరింత రాజకీయ రచ్చగా మారే అవకాశం కనిపిస్తోంది.

#Chandrababu #Vizag Steel #Janasenani #Janasena #AP Cm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube