పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయినా జిల్లాస్థాయిలో కూడా పార్టీని ఇంకా బలపరచలేదని ,కనీసం జిల్లా నియోజకవర్గాలన ఇన్చార్జిలను కూడా ప్రకటించలేని పరిస్థితుల్లో జనసేన( Jana sena ) ఉందంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటాయి.ఆ విమర్శలలోఅన్నీ నిజాలు లేకపోయినప్పటికీ పూర్తిస్థాయిలో పార్టీ విస్తరణ పై జనసేన ఫోకస్ పెట్టలేదన్నది మాత్రం వాస్తవమనే చెప్పాలి.
ముఖ్యంగా జనసేన ను అభిమానిస్తున్న జన సైనికులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున ఉన్న కొన్ని నియోజకవర్గాలలో( Constituencies ) కూడా వారిని సంగటితం చేసి ముందుకు నడిపించే ఇన్చార్జులు లేకపోవడం ఉన్నా కూడా వారంతా స్తబ్దంగా ఉండి పార్టీ లైన్ ని పూర్తిస్థాయిలో ముందుకు తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో జనసేన పార్టీ ఇబ్బందులు పడింది.

అయితే వారాహి యాత్ర( Varahi yatra ) ద్వారా లభించిన ఆదరణను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్న జనసేన పూర్తిస్థాయి నియోజకవర్గ ఇన్చార్జిలు నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించిన జనసేనా ని ఇప్పుడు పూర్తిస్థాయి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించే ప్రక్రియను మొదలు పెట్టారని తెలుస్తుంది. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తీసుకున్నప్పటికీ జనసేన ను పూర్తిస్థాయి ఆల్టరేషన్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలబెట్టాలనే దీర్ఘకాల ప్రణాలిక తో పార్టీని బూత్ లెవెల్ కమిటీల వరకు విస్తరించాలనే పట్టుదలతో జనసేనా ని ఉన్నారని తెలుస్తుంది.

ఇకపై మండల స్థాయి కమిటీలు ,గ్రామస్థాయి కమిటీలతో జనసేన పార్టీ రూట్ లెవల్ వరకూ చోచ్చుకుపోయే విధంగా పక్కా ప్రణాళికతో పార్టీ విస్తరణను చేపట్టాలని ఇకపై మిగిలిన ప్రధాన రాజకీయ పార్టీల లాగే జనసేన కూడా పూర్తిస్థాయిలో సంస్థాగతం గా విస్తరించి ప్రదాన పార్టీలకు పోటీ ఇస్తుందని జనసేననాయకులు అంటున్నారు
.