అందరి అంచనాలని జనసేనాని తారుమారు చేయబోతున్నడా  

జనసేన ప్రభావంపై అంచనాలు వేస్తున్న రాజకీయ పార్టీలు. .

Janasena Influence In Ap Politics-chandrababu,janasena Influence,tdp,ys Jagan,ysrcp

ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా తన ప్రస్తానం మొదలెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అని, పవన్ కళ్యాణ్ ఎన్నికలలో కింగ్ మేకర్ గా అవతరించడం గారంటీ అనే మాట వినిపిస్తుంది. అయితే రాజకీయ విశ్లేషకుల ఆలోచనలకి విరుద్ధంగా జనసేన ప్రభావం ఏ మాత్రం ఏపీలో ఉండదని చాలా మీడియా సంస్థలు సర్వేలలో తెలియజేసాయి..

అందరి అంచనాలని జనసేనాని తారుమారు చేయబోతున్నడా-Janasena Influence In AP Politics

ఇక మరో సారి దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి.ఇప్పటికే లగడపాటి తన తాజా సర్వే గురించి కొన్ని విషయాలు చూచాయగా చెప్పారు. దీని ప్రకారం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెత్తబోతున్నాడు అని స్పష్టం చేసాడు.

అలాగే పీఆర్పీ స్థాయిలో ప్రభావం చూపించాకున్న ఆశించిన స్థాయిలోనే సీట్లు వస్తాయని చెప్పడం ద్వారా జనసేన ప్రభావం టీడీపీ, వైసీపీ గెలుపు ఓటములని డిసైడ్ చేస్తుందనే విషయాన్ని స్పష్టం చేసారు. ఇక రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాటల బట్టి జనసేన ఫ్యాక్టర్ ఈ సారి గట్టి ప్రభావం చూపించాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి రాబోయే ఎగ్జిట్ పోల్స్ జనసేన ప్రభావాన్ని ఎలా అంచనా వేసాయో అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.