జనసేనలో అన్ని గెలుపు గుర్రాలే! పొలిటికల్ ట్రెండ్!  

జనసేన మొదటి జాబితాలో బలమైన అభ్యర్ధులని ప్రకటించిన పవన్ కళ్యాణ్. టెన్సన్ లో టీడీపీ, వైసీపీ. .

  • ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని తీసుకొచ్చి ప్రజలలోకి శరవేగంగా దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నికల మీద పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఎలక్షన్ నోటిఫికేక్షన్ రిలీజ్ అయిన ఒక్క రోజులోనే జనసేన పార్టీ నుంచి బరిలో నిలబడే మొదటి అభ్యర్ధుల జాబితాని ప్రకటించడం ద్వారా తాను ఎన్నికలకి సన్నద్ధం అయ్యి వున్నాను అనే విషయాన్ని స్పష్టం చేసాడు. మొదటి జాబితాలో 32 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు, 9 మంది ఎంపీ అభ్యర్ధులని గురువారం అధికారికంగా పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం వుంది.

  • ఇక మొదటి జాబితాలో వున్న 32 జనసేన అభ్యర్ధుల లిస్టు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. జనసేన పార్టీ ప్రభావం ఎ మాత్రం ఉండదని కొట్టి పారేస్తున్న వారికి తన జాబితాతో పవన్ కళ్యాణ్ ఊహించని షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. మొదటి జాబితాలో వున్న అభ్యర్ధులని చూసుకుంటే ఆయా నియోజక వర్గాలలో బలమైన నాయకులుగా గుర్తింపు తెచ్చుకొని రాజకీయాలలో తమదైన ముద్ర వేసినవారే. వీళ్ళలో మెజారిటీ అభ్యర్ధులకి నోట్ తో సంబంధం లేకుండా తమ నియోజకవర్గంలో గెలిచే సత్తా వుంది. మొదటి జాబితాతోనే ప్రకటించిన ముప్పై రెండు సీట్లలో తన 25 సీట్ల వరకు కచ్చితంగా గెలుపు గుర్రాలే అని చెప్పాలి. వారికి పవన్ ఇమేజ్ తోడైతే ఇక వారి గెలుపుని ఎవరు ఆపలేరు. జనసేన మొదటి జాబితా అభ్యర్ధులని చూసిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు గెలుపు కోసం తమ రాజకీయ వ్యూహాలకి మరింత పదును పెట్టాల్సి వస్తుంది అని చెప్పాలి.