మాస్.. మ మ మాస్ జనసేన లో ఎక్కడ ?  

Janasena Want To Mass Peoples Following janasena party, pavan kalyan, janasenani, ap, jagan, bjp, chandrababu ,tdp , YSRCP, Nadendla Manohar - Telugu Ap, Bjp, Chandrababu, Jagan, Janasena Party, Janasenani, Nadendla Manohar, Pavan Kalyan, Tdp, Ysrcp

రాజకీయాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు తిరుగులేని విజయాన్ని సంపాదించుకోవాలంటే కావలసింది క్షేత్ర బలమైన పునాదులు, మాస్ క్లాస్ ఇమేజ్ ఇలా అన్ని రకాలుగానూ ఆరితేరి ఉండాలి.ఈ అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడుతూ, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి.

TeluguStop.com - Janasena Faced So Many Troubles In Politics

సందర్భానుసారం, సమయస్ఫూర్తి తో మాట్లాడుతూ, అవసరం ఉన్నా, లేకపోయినా సెంటిమెంట్ రగిల్చి అది తమకు, తమ పార్టీకి కలిసి వచ్చే విధంగా చేయాలి.ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, పార్టీ తరఫున స్పందిస్తూ జనాల్లోకి దూసుకు వెళ్లిపోవాలి.

ఇలాంటివి ఎన్నో చేస్తేనే రాజకీయ నాయకుడు అయినా, రాజకీయ పార్టీ అయినా, జనంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాయి.అలా కాకుండా హుందాగా మాత్రమే అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తాము అంటే రాజకీయంగా వెనుకబడి పోవాలి.

TeluguStop.com - మాస్.. మ మ మాస్ జనసేన లో ఎక్కడ -Political-Telugu Tollywood Photo Image

ఏపీలో టిడిపి, బిజెపి, వైసిపి ఇలా అన్ని పార్టీలు క్లాస్, మాస్ ఇమేజ్ తోనే జనాల్లోకి వెళ్తున్నాయి.ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించేందుకు సామాజిక వర్గాల వారీగా నాయకులు ఎప్పుడూ ఆయా పార్టీలకు సిద్ధంగా ఉంటారు.

కానీ జనసేన లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఏ విషయం అయినా పవన్ మాత్రమే స్పందిస్తూ ఉంటారు.ఆయన కాకపోతే జనసేన తరపున నాదెండ్ల మనోహర్ మాత్రమే స్పందిస్తారు తప్ప, మిగతా నాయకులు ఎవరూ, ఏ విషయం పైన స్పందించరు.పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లేవారు, మాస్ ఇమేజ్ సంపాదించే విధంగా చూసేవారు పవన్ తప్ప మరెవరు ఆ స్థాయి నాయకులు కనిపించడం లేదు

.అసలు జనసేన పార్టీలో నాయకుల సందడి పెద్దగా కనిపించకపోవడం ప్రధాన లోటుగా కనిపిస్తుంది.ప్రస్తుతానికి రాజకీయం ఇలా నడిచిపోయినా, ముందు ముందు జనసేనకు ఇవన్నీ తీవ్ర ఆటంకం కలిగించే అవకాశం ఉంది అనేది ఆ పార్టీ నాయకులే స్వయంగా అభిప్రాయపడుతున్నారు.

చెప్పుకోడానికి జనసేన పార్టీలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు ఎవరూ కనిపించడం లేదు.ఇది ఆ పార్టీకి కాస్త ప్రతికూల అంశమే.

#Chandrababu #Ysrcp #Jagan #Pavan Kalyan #Janasena Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Janasena Faced So Many Troubles In Politics Related Telugu News,Photos/Pics,Images..