జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan kalyan ) వారాహి యాత్రతో దూకుడు పెంచిన సంగతి తెలిసిందే.యాత్ర ఫలితంగా ఏపీ రాజకీయాలు వెడ్డెక్కాయి.
మొదటి దశ వారాహి యాత్ర కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే జరిగినప్పటికి యాత్ర ప్రభావం రాష్ట్రమంతట గట్టిగానే చూపించింది.పవన్ చేసిన వ్యాఖ్యలు, వైసీపీ పై వేసిన సెటైర్స్.
ఇలా వారాహి యాత్రలో ప్రతి అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతూనే వచ్చింది.కాగా మొదటి దశ వారాహి యాత్ర తరువాత జనసేనలోకి వలసలు బారిగానే పెరుగుతున్నాయి.

ముఖ్యంగా అధికార వైసీపీ( YCP )లోని చాలమంది అసంతృప్త నేతలు నెక్స్ట్ ఆప్షన్ గా జనసేన వైపు చూస్తున్నారు.విశాఖ జిల్లా వైసీపీ ఇంచార్జ్ పంచకర్ల రమేశ్ బాబు( Panchakarla Ramesh Babu ) ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు.ఇక ఇటీవల వార్తల్లో నిలుస్తున్న ప్రకాశం జిల్లా వైసీపీ నేత అమంచి స్వాములు కూడా వైసీపీకి .నుంచి జనసేన గూటికి చేరారు.ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో కీలక నేత పేరు వినిపిస్తోంది.మాజీ మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డి గత కొన్నాళ్లుగా వైసీపీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన పార్టీ విడేందుకు సిద్దమౌతున్నట్లు టాక్.

ఒకవేళ అదే గనుక జరిగితే ఆయన కూడా జనసేనలోనే చేరే అవకాశం ఉంది.ఇలా వైసీపీలోని చాలమంది నేతలు జనసేన వైపు చూస్తుండడంతో వైసీపీ క్యాడర్ లో గుబులు మొదలైందనే చెప్పాలి.ఇక త్వరలో పవన్ వారాహి యాత్ర రెండవ దశను కూడా ప్రారంబించనున్నారు.
రెండవ దశలో మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టే విధంగా పవన్ ప్రణాళికలు రచిస్తున్నారు.తాజా పరిణామాలు చూస్తుంటే వైసీపీకి జనసేన పార్టీ నుంచే తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
అటు వైసీపీ నేతలు కూడా టీడీపీని పక్కన పెట్టి జనసేన పార్టీని నిలువరించడంపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.మరి జనసేన ఎఫెక్ట్ వైసీపీని ఏ స్థాయిలో దెబ్బ తీస్తుందో చూడాలి.