జనసేన తప్పటడుగు...ముమ్మిడివరం ముంచనుందా...  

Janasena Did Wrong Step In Mummidivaram-

పవన్ తన అన్న బాటలోనే అడుగులు వేస్తున్నారా.? పార్టీ హైప్ కోసం లేని పోనీ వాగ్దానాలు చేసుకుంటూ సంచలనాల కోసం పాకులాడుతూ ప్రజా రాజ్యం లాంటి మునిగిపోయిన పడవ రూట్ లోనే పవన్ జనసేనని కూడా తీసుకువేళ్తున్నారని అంటున్నారు పరిశీలకులు..

Janasena Did Wrong Step In Mummidivaram--Janasena Did Wrong Step In Mummidivaram-

అసలు నిన్నటి రోజున పవన కళ్యాణ్ ప్రకటించిన పితాని బాలకృష్ణ విషయాన్ని ఒక్క సారి పరిశీలిస్తే.ఒక పార్టీలో రెండేళ్ళు పాటు పని చేసిన ఆయన్ని ఆ పార్టీ ఎందుకు పక్కన పెట్టింది.ఎందుకు వేరే వర్గానికి చెందిన వ్యక్తిని చేరదీసింది.

అనే విషయాలని పవన్ కనీసం పరిసీలించుకునే ప్రయత్నం కూడా చేయరా.? అనే సందేహాలు అభిమానులలో కూడా కలుగుతున్నాయి.

జనసేన తొలి అభ్యర్ధిని ప్రకటించడం గొప్ప విషయమే కానీ ఆ ప్రకటన అందరిని సంతోష పెట్టే విధంగా అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ మొదటి అభ్యర్ధి విషయంలో చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని తూగో జిల్లా జనసేన నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.కానిస్టేబుల్ గా ప‌నిచేసిన పితాని ప‌దవీకాలం ముగియ‌కుండానే రాజ‌కీయ ఆస‌క్తితో ఉద్యోగం వ‌దులుకున్నారు.వైసీపీ కోసం రెండేళ్ల పాటు ప‌నిచేశారు…అయితే మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ పార్టీలో చేరిన త‌ర్వాత ఆయన సామాజిక వర్గం అయిన మ‌త్స్య‌కారుల వైపు మొగ్గుచూపిన జ‌గ‌న్ , పితానిని పక్కన పెట్టేశారు అయితే ఎలాంటి పరిణామాల దృష్ట్యా జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారో కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతన్నా ఉంది.

అయితే ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాట్లు బుచ్చిబాబు క్ష‌త్రియ వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు ఆర్ధికంగా కూడా ఎంతో బలమైన వ్యక్తి కూడా.సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత కావ‌డ‌మే కాకుండా ఆర్థికంగా బలమైన వ్యక్తి కూడా అయితే జ‌న‌సేన అభ్య‌ర్థి టీడీపీ నేతని డీ కొట్టాలి అంటే ఎంతో తీవ్రంగా శ్రమించవలసిన అవసరం ఎంతో ఉంది ఇక వైసీపీ అభ్యర్ధి పొన్నాడ విషయానికి వెళ్తే.ఆ నియోజకవర్గ పరిధిలో పొన్నాడ సామజిక వర్గం అయిన మ‌త్స్య‌కారులు అధికంగా ఉండటమే కాకుండా ఆర్ధికంగా కూడా ఎంతో శక్తివంతమైన నేతగా ఆయనకి అక్కడ పేరు ఉంది..

ఈ క్రమంలో

ఇద్దరు బలమైన నేతలని ఎదుర్కోవడం రెండేళ్లుగా వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గా చేసిన పితాని వల్ల అవ్వదు అనేది అక్కడి రాజకీయ ఉద్దండుల విశ్లేషణ.అయితే పితాని అక్కడ పట్టు సాధించాలి అంటే మాత్రం తప్పకుండా కాపు, శెట్టిబ‌లిజ క‌ల‌యిక బాగా పనిచేయాలని కానీ పితాని బాలకృష్ణ కి ముమ్మడివరం లో అంతగా పట్టు లేదని అందుకే అతడికి వైసీపీ లో కీలక భాద్యతల నుంచీ తప్పించారని టాక్ కూడా వినిపిస్తోంది.

మరి ఈ తరుణంలో జనసేన గెలుపుపై తేల్చి చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది.అయితే పవన్ అభ్యర్ధులని ఎంపిక చేసే ముందు సొంత సర్వేల ఆధారంగా ముందడుగు వేయడం మంచిదని సలాహాలు ఇస్తున్నారు విశ్లేషకులు.