పిచ్చ పిచ్చగా ఉందా ..? వారిపై పవన్ ఆగ్రహం     2018-10-21   16:03:44  IST  Sai Mallula

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తితలీ తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్న జనసేన అధినేత పవన్ … సంతకవిటి మండలంలో బాధితులను పవన్‌ శనివారం పరామర్శించారు. వాల్తేరు, ఇసుకలపేట గ్రామాల మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మించాలని కోరుతూ వంతెన పోరాట సమితి 610 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు.

Janasena Chieif Pavan Kalyan Angry On Fans At Srikakulam Tour-

Janasena Chieif Pavan Kalyan Angry On Fans At Srikakulam Tour

ఈ సందర్భంగా… పవన్‌ మాట్లాడుతుండగా అభిమానులు పెద్ద ఎత్తున ‘కాబోయే సీఎం… సీఎం’ అంటూ నినాదాలు చేశారు. పలుమార్లు పవన్‌ వారించినా ఆగలేదు. దీనితో ఆయన వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ‘పిచ్చి పిచ్చిగా ఉందా? మీరు మనుషులు కారా? ఇక్కడ ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో సీఎం అనడం మంచిది కాదు. మరోసారి ఇలా చేయద్దు’ అంటూ అభిమానులపై ఫైర్ అయ్యారు పవన్.