బీజేపీలో జనసేన విలీనం... ఓపెన్ అయ్యి క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్  

బీజేపీలో జనసేన విలీనంపై స్పందించిన పవన్ కళ్యాణ్.

Janasena Chief Pawan Kalyan Once Again Gives Clarity On His Political Journey-

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే ప్రయత్నంలో జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.గత ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ ప్రభావం, వైసీపీ విమర్శలు వెరసి ప్రజల నుంచి జనసేనకి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదు.

Janasena Chief Pawan Kalyan Once Again Gives Clarity On His Political Journey--Janasena Chief Pawan Kalyan Once Again Gives Clarity On His Political Journey-

మూడేళ్ళ పాటు ప్రజల మధ్య ఉంటూ ఎన్ని పోరాటాలు చేసి, ప్రజలతో మమేకం అయ్యి వారిలో ఒకరిగా ఉంటూ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ ని జనం విశ్వసించలేదు.అయితే అతనికి భవిష్యత్తు ఉంది అనే విషయాన్ని తమ ఓట్లతో చెప్పకనే చెప్పారు.

Janasena Chief Pawan Kalyan Once Again Gives Clarity On His Political Journey--Janasena Chief Pawan Kalyan Once Again Gives Clarity On His Political Journey-

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేసిన బీజేపీ పార్టీ తమ ఎదుగుదలకి ప్రధాన అడ్డంగా ఉన్న జనసేన పార్టీని తప్పించే ప్రయత్నాలు విస్తృతంగా చేస్తుంది. మొన్నటి వరకు జనసేన మీద ఏపీలో అధికార, ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేసి తన అన్నలాగే పవన్ కళ్యాణ్ కూడా పార్టీని అమ్ముకుంటాడు, ప్యాకేజీ ఇచ్చినపుడే బయటకి వచ్చిన మాట్లాడుతాడు అంటూ విమర్శలు చేసి వాటినే ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళి జనసేన గెలవకుండా నియంత్రించగలిగారు.

అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ జనసేన అనే పార్టీ లేకుండా చేయాలని తన అనుకూల మీడియా ద్వారా ఈ మధ్య కాలంలో విపరీతంగా పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ ప్రచారం చేయిస్తుంది.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తాడు అంటూ కొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చింది.

ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు.తాను పూర్తి స్థాయిలో రాజకీయాలలోకి వచ్చానని జనసేన పార్టీతగి మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటానని చెప్పాడు.అయిన కూడా అతని మీద నెగిటివ్ ప్రచారం ఆపలేదు.మరో సారి బీజేపీతో జనసేన పార్టీ కలిసిపోతుంది అని ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు.

దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద స్పష్టత ఇచ్చి తాను జనసేన పార్టీని బీజేపీలో కలిపే ఆలోచన చేయడం లేదని, ఏపీ రాజకీయాలలో తన ప్రస్తానం జనసేనతోనే సాగుతుందని వివరణ ఇచ్చారు.