స్థానిక సంస్థలని లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్! వాళ్ళే మెయిన్ టార్గెట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కొంత సమయం గ్యాప్ తీసుకొని మరల తన కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే విషయం స్పష్టం చేసాడు.ఇందులో భాగంగా కమిటీలు ఏర్పాటు చేసి వాటి బాద్యతని కూడా కొంత మంది నేతలకి అప్పగించాడు.

 Janasena Chief Plan To Strong Leadership For Party-TeluguStop.com

ఇదే సమయంలో భవిష్యత్తుని లక్ష్యంగా చేసుకొని యువ నాయకత్వంని బయటకి తీసుకొచ్చే ప్రయత్నంలో జనసేనాని కసరత్తు చేస్తున్నాడు.ఇందుకు ముందుగా స్థానిక సంస్థలని లక్ష్యంగా పెట్టుకున్నాడని తెలుస్తుంది.

జనసేన బలమైన పునాదులు ఏర్పాటు చేసుకొని పైకి లేగాదానికి ఏపీలో బలమైన శక్తిగా ఎదగడానికి ఇప్పుడు ఐదేళ్ళ సమయం ఉంది.దానికి ఆరంభంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి.

ఈ ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో జనసేన పార్టీకి అండగా ఉండే నాయకత్వాన్ని తయారు చేసి వారితో బలమైన పోటీ ఇవ్వడం ద్వారా గ్రామస్థాయిలో పునాదులు ఏర్పరుచుకోవాలని చూస్తుంది.ఇక ఈ ఎన్నికలలో గెలుపు అవకాశాలు ఎలా ఉన్న గట్టి పోటీ ఇవ్వడంతో పాటు, బలమైన క్యాడర్ ని నిర్మించుకోవడంలో పవన్ కళ్యాణ్ పక్క ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

అలాగే ప్రధాన పార్టీలలో సెకండ్ క్యాడర్ గా ఉంటూ ఎప్పటి నుంచో సరైన అవకాశం కోసం చూస్తున్న నేతలని కూడా జనసేనాని టార్గెట్ చేసి తన పార్టీలోకి వచ్చేలా చేసుకోవడం ద్వారా సామాజిక, ఆర్ధిక పరమైన సమీకరణాలు కూడా సిద్ధం చేసుకున్నారని సమాచారం.వీటిని స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అమలులో పెట్టె అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube