పవన్ డిసైడ్ అయ్యాడు ..! అందుకేనా ఈ హడావుడి ?

ఎప్పుడూ ఒకే రకంగా ముందుకు వెళ్తే ఫలితం ఉంటుందో లేదో తెలియదు గాని, సరికొత్త రాజకీయం చేయడం ద్వారా, రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.అందుకే ఏపీలో బలం పెంచుకోవడంతో పాటు,  తెలంగాణలోని బలపడాలని డిసైడ్ అయ్యారు.

 Janasena Chief Sensational Decision On Ghmc Elections, Telangana, Janasena Party-TeluguStop.com

ఎప్పటి నుంచో తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్, సరైన సందర్భం రాకపోవడంతో,  పెద్దగా యాక్టివ్ కాలేకపోతున్నారు.అదే సమయంలో ఏపీలో పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

రాజకీయంగా ఎదురుదెబ్బలు తింటోంది.క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడం వంటి కారణాలతో పూర్తిగా బలం పెంచుకునే విషయంపై దృష్టి సారించారు.

ఆ బలం పెంచుకునేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.

 ఏదో రకంగా, అక్కడ బలమైన పునాదులు వేసుకు ని, 2024 ఎన్నికల నాటికి బలపడాలనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే అనేక కమిటీలను నియమించిన పవన్ బిజెపి అండదండలతో మరింతగా బలం పెంచుకుని ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన తో పొత్తు పెట్టుకున్న బిజెపి మాత్రం పవన్ ను అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఇటీవల దుబ్బాక నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలి అని చూసినా, పవన్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఇప్పుడు అక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు, బిజెపి సహకారంతో గట్టెక్కాలని చూస్తోంది.

Telugu Dubbaka, Greater, Janasena, Pawan Kalyan, Telangana-Telugu Political News

గ్రేటర్ పరిధిలో పవన్ కు అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండటం, సామాజికవర్గం అండదండలు ఇలా ఎన్నో అంశాలను లెక్కలోకి తీసుకుంటున్న పవన్ జనసేన ను తెలంగాణలో బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఇప్పటికి అనేక కమిటీలను నియమించిన ఆయన, తాజాగా మరికొన్ని కమిటీలను ప్రకటించారు. విద్యార్థి యువజన కమిటీలను తాజాగా ప్రకటించారు.  జనసేన తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గా సంపత్ నాయక్ ను, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గా రామకృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడిగా లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కిరణ్ కుమార్, సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా దుంపటి శ్రీనివాస్ ను నియమించారు.
ఇవే కాకుండా గ్రేటర్ పరిధిలోని మరెన్నో కమిటీలను నియమించాలని, ఏ ఏ డివిజన్లలో జనసేన కు బలం ఉంది ? అనే అంశాలపై పార్టీ నేతలతోనే సర్వే నిర్వహించి,  బిజెపి ని ఒప్పించి ఆయా డివిజన్ లలో సీట్లు తీసుకోవాలని పవన్ అభిప్రాయపడుతున్నారట.దీనికితోడు బిజెపి తెలంగాణలో ఈ మధ్యకాలంలో బలపడటంతో, ఆ పార్టీ అత్యధిక స్థానాలతో పాటు, మేయర్ స్థానాన్ని కూడా దక్కించుకుంటే జనసేనకు కలిసొస్తుందనే విధంగా పవన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube