పవన్ సంచలన నిర్ణయం ? ఫిదా అవుతున్న బీజేపీ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్ వేసేశారు.ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఆ పార్టీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Janasena Chief Pawan Kalyan Sensational Decision Over Antarvedi Issue, Pawan Kal-TeluguStop.com

బీజేపీ అగ్రనేతలను తన నిర్ణయంతో ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.ఇప్పటి వరకు జనసేన బీజేపీ పొత్తు ఉన్నా, బీజేపీ అగ్రనేతలు ఎవరూ పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తుండటం, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఏపీలో బీజేపీ నేతలు జనసేన కలుపుకు వెళ్లకపోవడం, ఇలా చాలా అంశాలు చాలా కాలంగా ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

అయినా బీజేపీతో ఉంటే కలిగే లాభాలు ఏంటో పవన్ కు బాగా తెలుసు.అందుకు సరైన సమయం కోసం వేచి చూస్తూ వస్తున్నారు.

ఈ తరుణంలో, అంతర్వేదిలో రథం దగ్ధమైన సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకుని, బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.అందుకే అకస్మాత్తుగా హిందూ స్టాండ్ తీసుకొని అంతర్వేది సంఘటనపై పవన్ సీరియస్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు.

హిందూ ఆలయాలపై దాడులు చేస్తే, హిందూ మనోభావాలు దెబ్బ తీస్తే, చూస్తూ ఊరుకోబోమని వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా వదిలిపెట్టమని, దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు చేసే విధంగా కేంద్రంను ఒప్పిస్తామంటూ పవన్ స్ట్రాంగ్ గా చెబుతున్నారు.

Telugu Hindus, Janasenapawan, Pawan Kalyan, Ycp-Telugu Political News

కేవలం అంతర్వేది సంఘటనే కాక, గతంలో హిందూ దేవాలయాలలో చోటు చేసుకున్న ప్రమాద సంఘటనను గుర్తు చేస్తూ, పవన్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నారు.అవసరమైతే ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయిలోకి దిగి పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు జనసేన తరపున పవన్ సిద్ధమవుతున్నారు.ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఇప్పటి వరకు బీజేపీ జనసేన తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తుండడంతో, పవన్ ఇక అన్నీ పక్కన పెట్టేసి, తనపై హిందూ ముద్ర పడినా, కొన్ని వర్గాలు దూరమైనా, బీజేపీతో కలిసి ముందుకు సాగాలని, అగ్రనేతలతో మరింత సాన్నిహిత్యం పెంచుకోవాలనే విధంగా పవన్ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక బీజేపీ సైతం పవన్ హిందూ అజెండా ఎత్తుకోవడంపై ఖుషిగానే ఉందట.అంతేర్వేది వ్యవహారంలోనే కాకుండా అన్ని విషయాల్లోనూ జనసేనను కలుపుకు వెళ్లాలనే విధంగా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube