రేపు ఢిల్లీకి జనసేనాని ప్రయాణం... అమరావతి ఇష్యూపై కీలక భేటీ  

Janasena Chief Pawan Kalyan Will Be Go To Delhi-bjp,delhi,janasena Chief,pawan Kalyan,three Capitals

ఏపీలో రాజకీయ వేడి రాజేసిన మూడు రాజధానులు, అమరావతి ఇష్యూలు ఇప్పుడు అన్ని పార్టీలకి ప్రధాన ఆయుధాలుగా మారిపోయాయి.ఎవరికి వారు దీనిని అవకాశంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Janasena Chief Pawan Kalyan Will Be Go To Delhi-Bjp Delhi Janasena Pawan Three Capitals

అధికార పార్టీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తో ఉత్తరాంద్ర, రాయలసీమలో తన పట్టుని మరింత పెంచుకోవాలని భావిస్తూ ఉంటే.టీడీపీ అమరావతినే రాజధానిగా ఉంచాలని చెబుతూ తాను తీసుకొచ్చిన రాజధానిని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది.

ఇక బీజేపీ, జనసేన పార్టీలు అమరావతిని బలపరుస్తూనే అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే విశాఖలో పరిపాలనా రాజధాని పెట్టడం ద్వారా ప్రశాంత విశాఖలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని వైసీపీ భావిస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు.


ఇదిలా ఉంటే ఈ రాజధాని మార్పుపై చర్చించి ఉమ్మడి కార్యాచరణతో ముందుకి వెళ్ళడానికి జనసేన, బీజేపీ సిద్ధం అవుతుంది.వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేస్తుంది.

దీనికి గాను పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.అక్కడ రాష్ట్ర, జాతీయ బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని తెలుస్తుంది.

ఈ సమావేశం తర్వాత అమరావతిపై ఏ రకంగా ఉద్యమించాలనే దానిపై ఇరు పార్టీలు కలిసి కార్యాచారణ రూపొందించనున్నాయి.ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీలో ఉండగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా ఢిల్లీలో ఉన్నారు, వారు ఢిల్లీ నుంచి ఏపీ రాజకీయాలలో జరుగుతున్నా పరిణామాలపై స్పందించారు.

ఇక జనసేనతో కలిసి అమరావతిపై పోరాటానికి బీజేపీ నేతలు కార్యాచరణ రూపొందిస్తారని ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి అమరావతిపై ఎలాంటి పోరాటం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

.

తాజా వార్తలు

Janasena Chief Pawan Kalyan Will Be Go To Delhi-bjp,delhi,janasena Chief,pawan Kalyan,three Capitals Related....