జనసేనాని కీలక ప్రకటన  

Janasena Chief Pawan Kalyan Take The Key Decission-pawan Kalyan Protect The Building Contractors,pawan Long March,pawan Respond In Sand

మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రజలు ఓట్లు వేయకున్నా, సీట్లు ఇవ్వకున్నా వారి పక్షాన పోరాడేందుకు పవన్‌ నడుం భిగించాడు.ప్రతి ప్రజా సమస్యపై పోరాడేందుకు సిద్దం అయ్యాడు.ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఇసుక లేమి సమస్యపై పవన్‌ పోరాడుతున్న విషయం తెల్సిందే.

Janasena Chief Pawan Kalyan Take The Key Decission-pawan Kalyan Protect The Building Contractors,pawan Long March,pawan Respond In Sand-Janasena Chief Pawan Kalyan Take The Key Decission-Pawan Protect Building Contractors Pawan Long March Respond In Sand

భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను పరిష్కరించాలంటూ ప్రభుత్వంకు వ్యతిరేకంగా వైజాగ్‌లో లాంగ్‌ మార్చ్‌ను పవన్‌ నిర్వహించాడు.వైజాగ్‌లో నిర్వహించిన లాంగ్‌ మార్చ్‌కు మంచి ఆధరణ లభించింది.భారీ ఎత్తున జనాలు హాజరు అవ్వడంతో జనసేనానిలో కొత్త ఉత్తేజం వచ్చినట్లుగా ఉంది.

అందుకే పార్టీని సంస్థాగతంగా నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అందులో భాగంగా మొదట పార్టీ అధికార ప్రతినిధులను నియమించడం జరిగింది.ఇప్పటికే కొందరు అధికార ప్రతినిధులు ఉండగా వారికి అదనంగా పండా సుజాత, సుందరపు విజయ్‌ కుమార్‌, పరుచూరి భాస్కర్‌రావులను జనసేన పార్టీ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేయడం జరిగింది అంటూ స్వయంగా జనసేనాని ట్విట్టర్‌లో ప్రకటించాడు.దాంతో పాటు పార్టీ నిర్వహించిన లాంగ్‌ మార్చ్‌ సక్సెస్‌లో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు.

పవన్‌ వరుసగా ట్వీట్లు చేస్తూ పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను అభినందించాడు.